close

తాజా వార్తలు

Updated : 21/10/2020 20:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ఆఫర్.. 48 గంటలు ఉచితం

ఇంటర్నెట్‌ డెస్క్‌: నెట్‌ఫ్లిక్స్‌ భారత వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది. దేశంలోని ప్రతి ఒక్కరికీ 48 గంటలపాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ సేవలను అందించనున్నారట. నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త వినియోగదారులను ఆకర్షించడంలో భాగంగా ‘స్ట్రీమ్‌ ఫెస్ట్‌’ అనే కార్యక్రమం నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమాన్ని తొలుత మన దేశంలోనే తీసుకొస్తారట. అందులో భాగంగా డిసెంబరు 4 నుంచి 48 గంటల ఉచిత నెట్‌ఫ్లిక్స్‌ ఆఫర్ తీసుకొస్తున్నారు. 

గతంలో సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండా వినియోగదారులు నెల పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ సేవలు పొందే అవకాశం ఉండేది. ఇటీవల దానిని కొన్ని దేశాల్లో తొలగించారు. ఇప్పుడు దాని స్థానంలో ఈ 48 గంటల ఆఫర్‌ తీసుకొస్తున్నారని భోగట్టా. త్వరలోనే దీనిపై నెట్‌ఫ్లిక్స్‌ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్‌‌ ఇటీవల వివిధ దేశాల్లో నెల రోజుల ఉచిత సేవల ఆఫర్‌ నిలిపేసిన విషయం తెలిసిందే.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.