20 ఏళ్లు దాటితే వాహనాలు తుక్కుకే..! - New scrappage Policy
close

Updated : 01/02/2021 12:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

20 ఏళ్లు దాటితే వాహనాలు తుక్కుకే..!

దిల్లీ: కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రకటించారు. అందులో భాగంగా ఈ సారి బడ్జెట్‌లో నూతన విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. వాహనాలు పర్యావరణ హితంగా ఉండాలన్న లక్ష్యంతో.. వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురాబోతుందని వెల్లడించారు. కాలం చెల్లిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20 ఏళ్లు, వాణిజ్య వాహనాల జీవితకాలాన్ని 15 ఏళ్లుగా నిర్ణయించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వాయు కాలుష్య నివారణకు రూ.2,217 కోట్లు కేటాయించారు.

గత కొన్ని సంవత్సరాలుగా వేచిచూస్తున్న తుక్కు విధానం అమల్లోకి రానుండడంతో ఆటో రంగం సానుకూల దిశగా పయనించే అవకాశం ఉంది. కరోనాకు ముందు నుంచే గడ్డు కాలం ఎదుర్కొంటున్న ఆటో రంగంలో జోష్‌ నింపడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. పాత వాహనాలు నిరుపయోగంగా మారనుండడంతో కొత్త వాటికి గిరాకీ పెరిగి క్రమంగా ఉత్పత్తి పుంజుకునే అవకాశం ఉంది. కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి కొన్ని ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌లో ఆటోమొబైల్‌ కంపెనీల భారీ లాభాల్లో పయనిస్తున్నాయి.

ఇవీ చదవండి...

కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్దపీట

బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్స్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని