స్వతంత్ర డైరెక్టర్ల నియామకాలకు కొత్త వ్యవస్థ - New system for appointments of independent directors
close

Published : 02/03/2021 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వతంత్ర డైరెక్టర్ల నియామకాలకు కొత్త వ్యవస్థ

 సెబీ ప్రతిపాదనలు

దిల్లీ: స్వతంత్ర డైరెక్లర్ల విషయంలో నియంత్రణ పరమైన వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సెబీ భావిస్తోంది. ఇందుకోసం ద్వంద్వ అనుమతి వ్యవస్థను ప్రతిపాదించింది. దీని కిందకు వీరి నియామకాలు, తొలగింపులు, రాజీనామా లేఖల వెల్లడి వంటివన్నీ వస్తాయి. సెబీ ప్రతిపాదన ప్రకారం.. స్వతంత్ర డైరెక్టర్ల నియమాకాలకు ‘మైనారిటీల్లో మెజారిటీ’ వాటాదార్ల అనుమతులను పొందాల్సి ఉంటుంది. ప్రమోటరు, ప్రమోటరు గ్రూప్‌ కాకుండా మిగతా వారిని మైనారిటీ వాటాదార్లంటారు. అంతే కాకుండా..స్వతంత్ర డైరెక్టర్లకు లాభాలతో అనుసంధానం చేసిన కమిషన్‌కు బదులుగా ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్స్‌(ఈసాప్స్‌)ను అనుమతించవచ్చేమో పరిశీలించాలనీ కోరింది. స్వతంత్ర డైరెక్టర్ల పారితోషికాన్ని సమీక్షించడంలో భాగంగా ఈ ప్రతిపాదన చేసింది. స్వతంత్ర డైరెక్టర్లకు సంబంధించి నియంత్రణపరమైన నిబంధనలను సమీక్షిస్తూ చర్చా పత్రాన్ని సోమవారం సెబీ జారీ చేసింది. అదే సమయంలో వ్యక్తిగత కారణాలు చూపుతూ ఒక బోర్డు నుంచి రాజీనామా చేసిన అనంతరం ఇంకో బోర్డులో చేరడానికి కనీసం ఒక ఏడాది సమయం ఉండాలనీ ప్రతిపాదించింది. అదే సమయంలో ప్రమోటరు గ్రూప్‌ కంపెనీల్లో కీలక యాజమాన్య వ్యక్తులు, ఉద్యోగులు స్వతంత్ర డైరెక్టర్లుగా చేరాలంటే మూడేళ్ల (కూలింగ్‌) సమయం ఉండాలి. స్వతంత్ర డైరెక్లర్ల అర్హత ప్రమాణాలను విస్తృతపరచడం; నామినేషన్లలో పారదర్శకతను తీసుకురావడం, ఆడిట్‌ కమిటీలో వ్యక్తుల నిష్పత్తి వంటి పలు ఇతర ప్రతిపాదనలనూ చేసింది. ఏప్రిల్‌ 1లోగా ఈ చర్చాపత్రంపై అన్ని వర్గాలు తమ స్పందనలను తెలపవచ్చు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని