నిఫ్టీ @ 14,000 - Nifty Hits 14000 for first time
close

Published : 31/12/2020 10:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిఫ్టీ @ 14,000

ముంబయి: దేశీయ మార్కెట్లు గురువారం లాభాల్లో సాగుతున్నాయి. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 14వేల మార్క్‌ను తాకింది. ఉదయం 10.40 గంటల ప్రాంతంలో 23 పాయింట్ల లాభంతో 14,005 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిలో ట్రేడ్‌ అవుతోంది. అటు బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 106 పాయింట్ల లాభంతో 47,853 వద్ద కొనసాగుతోంది. 

డిసెంబరు డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ఈ ఉదయం మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో ట్రేడింగ్‌ ఆరంభంలో సూచీలు కాస్త ఒడుదొడుకులకు లోనయ్యియి. ఒక దశలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్‌ అయ్యింది. అయితే, ఆ తర్వాత ఆటోమొబైల్‌ షేర్ల అండతో కోలుకున్న సూచీలు మళ్లీ లాభాల బాట పట్టాయి. కరోనా వ్యాక్సిన్‌పై సానుకూల వార్తల నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి సూచీలు కొత్త రికార్డులను నమోదు చేస్తోన్న విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..

ఓలెక్ట్రాకు రూ. 300కోట్ల ఆర్డర్లు

విమానంలో తరలివచ్చిన శాటిలైట్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని