15వేల దిగువకు నిఫ్టీ - Nifty closes below 15K
close

Updated : 05/03/2021 16:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

15వేల దిగువకు నిఫ్టీ

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మన మార్కెట్లపై పడింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, మెటల్‌, ఫైనాన్షియల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో నిఫ్టీ 15వేల దిగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.02గా ఉంది.

ఉదయం 50,400 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా అదే తీరున కొనసాగింది. ఒక దశలో 600 పాయింట్లకు పైగా కోల్పోయిన సూచీ.. చివరికి 440.76 పాయింట్ల నష్టంతో 50,40532 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 142.70 పాయింట్ల నష్టంతో 14,938.10 వద్ద స్థిరపడింది. నిప్టీలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, విప్రో లిమిటెడ్‌, యూపీఎల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌ షేర్లు ప్రధానంగా నష్టాలు చవిచూశాయి. ఓఎన్‌జీసీ, గెయిల్‌, మారుతీ సుజుకీ ఇండియా, కోటక్‌ మహీంద్రా, హీరో మోటోకార్ప్‌ షేర్లు లాభపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని