Stock market: రోజంతా లాభాల్లోనే.. - Nifty ends above 15700
close

Updated : 10/06/2021 16:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: రోజంతా లాభాల్లోనే..

ముంబయి: దేశీయ మార్కెట్లు మరోసారి అదరగొట్టాయి. రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. పీఎస్‌యూ బ్యాంకులు, మెటల్‌, ఫార్మా షేర్లు రాణించడంతో మరోసారి భారీ లాభాలు మూటగట్టుకున్నాయి. నిఫ్టీ 15,700 పాయింట్ల పైన ముగిసింది.

ఉదయం 52,105 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌.. రోజంతా లాభాల్లోనే కదలాడింది. చివరికి 358.83 పాయింట్లు లాభపడి 52,300.47 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 102.40 పాయింట్లు లాభపడి 15,737.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.06 గా ఉంది.

నిఫ్టీలో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ, దివీస్‌ ల్యాబ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఐటీసీ లిమిటెడ్‌, బజాజ్‌ ఆటో, ఐషర్‌ మోటార్స్‌, యూపీఎల్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని