stock market : లాభాల్లో ముగిసిన సూచీలు - Nifty ends at new closing peak of 15690
close

Published : 03/06/2021 16:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

stock market : లాభాల్లో ముగిసిన సూచీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడం కూడా మార్కెట్లో ఉత్సాహాన్ని నింపింది. సెన్సెక్స్‌ 382 పాయింట్ల లాభంతో 52,232 వద్ద.. నిఫ్టీ 114 పాయింట్ల లాభంతో 15,690 వద్ద  స్థిరపడ్డాయి. బీఎస్‌ఈలో స్పందనా స్ఫూర్తి ఫైనాన్స్‌, వీఎస్‌టీ టిల్లర్స్‌, నెల్కో లిమిటెడ్‌, భన్సాలీ ఇంజినీరింగ్‌, స్నోమాన్‌ లాజిస్టిక్స్‌ షేర్లు లాభపడగా.. మదర్సన్‌ సుమీ సిస్టమ్స్‌, కిరి ఇండస్ట్రీస్‌, ఏషియన్‌ గ్రానైట్‌ ఇండియా, టీసీఐ ఎక్స్‌ప్రెస్‌ షేర్లు నష్టపోయాయి. 

నేటి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు నిఫ్టీ ఆటో, ఫార్మా రంగం స్టాక్స్‌ నుంచి నిధులను మళ్లిస్తుండటంతో ఆయా రంగాల కంపెనీల షేర్లు నష్టపోయాయి. ఇక రియాల్టీ రంగం సూచీ నేటి ట్రేడింగ్‌లో అత్యధికంగా 4శాతం లాభపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 24 పైసలు నష్టంతో రూ.72.68 వద్ద ఉంది. ఇక ఎంసీఎక్స్‌ 10గ్రాముల బంగారం విలువ రూ.496 పెరిగి రూ.49,650 వద్ద, వెండి రూ.750 తగ్గి రూ.71,928 వద్ద ట్రేడవుతున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని