14,300 దిగువకు నిఫ్టీ - Nifty ends below 14300
close

Published : 18/01/2021 15:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

14,300 దిగువకు నిఫ్టీ

ముంబయి: దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు డీలాపడ్డాయి. సెన్సెక్స్‌ దాదాపు 500 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 14,300 దిగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.28గా ఉంది.

ఉదయం 49వేల పాయింట్ల పైన ప్రారంభమైన సెన్సెక్స్‌ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఒకానొక దశలో 600 పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్‌.. చివరికి 470.40 పాయింట్ల నష్టంతో 48,564.27 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 152.40 పాయింట్ల నష్టంతో 14,281.30 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో యూపీఎల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టైటాన్‌ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, హిందాల్కో, సన్‌ఫార్మా షేర్లు నష్టాలు చవిచూశాయి. అన్ని రంగాల షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి.

ఇవీ చదవండి..
భగ్గుమంటున్న పెట్రోల్‌ ధరలు
చైనాకు ట్రంప్‌ చివరి ఝలక్‌!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని