మార్కెట్లకు భారీ నష్టాలు - Nifty ends below 14350
close

Updated : 25/03/2021 16:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్లకు భారీ నష్టాలు

ముంబయి: దేశీయ మార్కెట్లు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం, వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్లు విధిస్తుండడం, ఆర్థిక రికవరీ భయాలతో మదుపర్లు అమ్మకాలకు దిగారు. దీంతో మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 49 వేల మార్కును, నిఫ్టీ 14,350 మార్కును కోల్పోయాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఎనర్జీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 72.62గా ఉంది.

ఉదయం 49,067 పాయింట్ల వద్ద నష్టాల్లో స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ తర్వాత భారీ నష్టాల్లోకి జారుకుంది. చివరికి 740.19 పాయింట్ల నష్టంతో 48,440.12 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 224.50 పాయింట్ల నష్టంతో 14,324.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో మారుతీ సుజుకీ ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, కోల్‌ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని