స్టాక్‌:వరుస లాభాలకు బ్రేక్‌ - Nifty ends below 15100
close

Published : 04/03/2021 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టాక్‌:వరుస లాభాలకు బ్రేక్‌

ముంబయి: వరుస లాభాలతో జోరుమీదున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ల దూకుడుకు బ్రేక్‌పడింది. నిఫ్టీ బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, మెటల్‌, ప్రైవేట్‌ బ్యాంకుల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ షేర్లు రాణించడం కొంతమేర కలిసొచ్చింది. సెన్సెక్స్‌ దాదాపు 600 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ కీలకమైన 15,100 మైలురాయిని మరోసారి కోల్పోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 72.83గా ఉంది.

ఉదయం 50,711 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఒకానొక దశలో దాదాపు 900 పాయింట్ల వరకు కోల్పోయిన సూచీ.. చివరకు 598.57 పాయింట్ల నష్టంతో 50,846.08 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 164.80 పాయింట్ల నష్టంతో 15,080 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌ షేర్లు ప్రధానంగా నష్టాలు చవిచూశాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, శ్రీ సిమెంట్స్‌, అదానీ పోర్ట్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు సైతం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని