Stock market: నష్టాల్లో సూచీలు.. - Nifty ends below 15700
close

Updated : 17/06/2021 16:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: నష్టాల్లో సూచీలు..

ముంబయి: దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లు పెంచుతుందన్న సంకేతాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. దేశీయ మార్కెట్లపైనా దాని ప్రభావం ఉండడంతో సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. నిఫ్టీ 15,700 దిగువన ముగిసింది.

ఉదయం 52,231 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. రోజంతా అదే ఒరవడిని కొనసాగించింది. చివరికి 178.65 పాయింట్ల నష్టంతో 52,323.33 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 76.10 పాయింట్లు నష్టపోయి 15,691.40 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.08 వద్ద ముగిసింది. 

నిఫ్టీలో అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హిందాల్కో, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టీసీఎస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, టాటా కన్జ్యూమర్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభపడ్డాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు మినహా మిగిలిన షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని