Stock market: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు - Nifty ends below 15700
close

Updated : 01/07/2021 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో సూచీలు డీలాపడ్డాయి. అదే సమయంలో ఆటో, ఫార్మా షేర్లు రాణించడం కొంత కలిసొచ్చింది. ఉదయం 52,547 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా ఒడుదొడుకులను ఎదుర్కొంది. చివరికి 164.11 పాయింట్లు నష్టపోయి 52,318.60 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 41.50 పాయింట్లు కోల్పోయి 15,680 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.55 వద్ద ముగిసింది. 

నిఫ్టీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ లిమిటెడ్‌, శ్రీ సిమెంట్స్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో లిమిటెడ్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఆటో, టాటా మోటార్స్‌, సన్‌ ఫార్మా షేర్లు రాణించాయి. రంగాల వారీగా చూస్తే ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా.. ఎనర్జీ, బ్యాంక్‌, మెటల్‌, ఇన్‌ఫ్రా, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని