లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు - Nifty ends near 14K
close

Updated : 30/12/2020 15:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోసారి లాభాల్లో ముగిశాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ షేర్లు రాణించడంతో సూచీలు వరుసగా ఆరో రోజూ లాభాలు చవిచూశాయి. దీంతో మరోసారి సూచీలు జీవనకాల గరిష్ఠాలను నమోదు చేయగా.. నిఫ్టీ 14 వేల మార్కుకు కొద్ది దూరంలో నిలిచింది.

ఉదయం 47,660 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఒడుదొడుకులకు లోనైనప్పటికీ లాభాల్లో ముగిసింది. చివరికి 133.14 పాయింట్ల లాభంతో 47,746.22 వద్ద నిలిచింది. నిఫ్టీ 41.15 పాయింట్ల లాభంతో 13,973.65 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.31గా ఉంది. నిఫ్టీలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, శ్రీ సిమెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యూపీఎల్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టాలు చవిచూశాయి. ఫార్మా, బ్యాంక్‌ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించాయి.

ఇవీ చదవండి..

2021లో ఇవి పెరగనున్నాయా?

చెక్ చెల్లింపులు చేస్తున్నారా.. జ‌న‌వ‌రి 1 నుంచి ఎస్‌బీఐ కొత్త రూల్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని