లాభాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు - Nifty tops 14700
close

Updated : 06/05/2021 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నేడు లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 272 పాయింట్లు పెరిగి 48,949 వద్ద, నిఫ్టీ 106 పాయింట్లు పెరిగి 14,724 వద్ద స్థిరపడ్డాయి. ఆర్‌ సిస్టమ్స్‌ ఇంటర్నెట్‌, ఇగార్షి మోటార్స్‌, కోఫోర్జ్‌, ఇంటెలెక్ట్‌ డిజైన్‌, మాస్టెక్‌  లిమిటెడ్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఆగ్రోటెక్‌ ఫుడ్‌, బంధన్‌ బ్యాంక్‌, మార్పిన్‌ ల్యాబ్స్‌, ఫ్యూచర్‌ లైఫ్‌ స్టైల్‌, యారీడజైన్స్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 

ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌ కాంట్రాక్టులు ముగిసిన దగ్గర నుంచి మార్కెట్‌ సానుకూలంగా ట్రేడవుతోంది. కంపెనీలు వెలువరిస్తున్న మార్చి త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉండటం కూడా సూచీలుకు కలిసి వస్తోంది. దీనికి తోడు కరోనా ప్రభావం నుంచి కోలుకొన్న అమెరికా, ఐరోపా మార్కెట్లు కొంత అండని ఇస్తున్నాయి. నేడు ఐరోపా మార్కెట్లు కంపెనీల ఫలితాలతో సరికొత్త శిఖరాలను చేరాయి. దీనికి తోడు పలు ఐరోపా బ్యాంకులు విడుదల చేసిన భవిష్యత్తు అంచనాలు కూడా సూచీలకు బలాన్నిచ్చాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని