నిస్సాన్‌ కార్లపై వారెంటీ పెంపు - Nissan India Extends Warranty And Free Service Period By Two Months
close

Published : 21/05/2021 21:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిస్సాన్‌ కార్లపై వారెంటీ పెంపు

ఇంటర్నెట్‌డెస్క్‌: నిస్సాన్‌ కార్ల వినియోగదారులకు కంపెనీ ఊరట కల్పించింది. కార్లపై ఇచ్చిన వారెంటీని రెండు నెలలు పొడిగించింది. కొవిడ్‌ కారణంగా చాలా రాష్ట్రాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం.. వర్క్‌షాప్‌లు మూసివేయడంతో ఈ నిర్ణయం తీసుకొన్నామని నిస్సాన్‌ పేర్కొంది. ఇప్పటికే ఇటువంటి ఆఫర్‌ను హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌, ఎంజీ, హోండా కంపెనీలు తమ వినియోగదారులకు అందించాయి. ఇప్పుడు నిస్సాన్‌ కూడా అదే బాటలో పయనిస్తోంది. వారెంటీతో పాటు ఉచిత సర్వీసు గడువును కూడా రెండు నెలలపాటు పొడిగించింది. ఈ విషయాన్ని నిస్సాన్‌ తన ట్విటర్‌ ఖాతాలో ప్రకటించింది.

‘‘మేము మీ విషయంలో జాగ్రత్తలు తీసుకొంటామని హామీ ఇచ్చాము. మేము దానిపై నిలబడుతున్నాము. ప్రస్తుతం ఇళ్లలోనే సురక్షితంగా ఉండటం ప్రపంచానికి సాయం చేయడమే. పరిస్థితులు చక్కబడ్డాక మిమ్మల్ని తిరిగి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటాము’’ అని ట్వీట్‌ చేసింది.  తాజాగా ఇచ్చిన రెండు నెలల పొడిగింపును లాక్‌డౌన్‌ ఎత్తివేత ఆధారంగా భవిష్యత్తులో పొడిగించే అవకాశం ఉంది. 

ఈ మినహాయింపు నిస్సాన్‌ విక్రయించే అన్ని మోడళ్లకు వర్తిస్తుంది. ఇటీవల విడుదల చేసిన మాగ్నైట్‌ మోడల్‌కు కూడా ఇది వర్తిస్తుంది.  ప్రస్తుతం తయారు చేసిన మాగ్నైట్‌ మోడళ్లు మొత్తాన్ని నిస్సాన్‌ విక్రయించింది. ప్రస్తుతం కిక్స్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీపై నిస్సాన్‌ రూ.75 వేల వరకు ఆఫర్లు ప్రకటించింది.మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని