EPFO: పీఎఫ్‌ చందాదారులకు అలర్ట్‌.. గడువులోగా ఆధార్‌ జత చేయకుంటే డబ్బులు పడవ్‌! - No EPF Money From Next Month if You do not Follow this new Rule
close

Published : 09/08/2021 18:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

EPFO: పీఎఫ్‌ చందాదారులకు అలర్ట్‌.. గడువులోగా ఆధార్‌ జత చేయకుంటే డబ్బులు పడవ్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పీఎఫ్‌ చందాదారులు యూఏఎన్‌ (UAN) నంబర్‌తో తమ ఆధార్‌ను జత చేయడాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తప్పనిసరి చేసింది. ఆగస్టు 31ను ఇందుకు గడువుగా విధించింది. ఒకవేళ ఆధార్‌ను జత చేయలేకపోతే సెప్టెంబర్‌ 1 నుంచి పీఎఫ్‌కు సంబంధించి ఎలాంటి సేవలూ పొందలేరు. యాజమాన్యాలు పీఎఫ్‌ మొత్తాలను జమ చేయలేకపోవడమే కాకుండా.. పీఎఫ్‌కు సంబంధించి చందాదారులు సైతం నగదును ఉపసంహరించుకోలేరు.

సోషల్‌ సెక్యూరిటీ కోడ్‌ కింద ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మే 3న ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తొలుత ఈపీఎఫ్‌ ఖాతాకు ఆధార్‌ జత చేయడానికి జూన్‌ 1ను ఈపీఎఫ్‌వో గడువుగా విధించింది. దాన్ని తాజాగా సెప్టెంబర్‌ 1 వరకు పొడిగించింది. ఇది వరకే మీరు ఆధార్‌తో మీ పీఎఫ్‌ ఖాతాను జత చేసి ఉంటే మరోసారి ధ్రువీకరించుకోండి. ఒకవేళ జత చేయని పక్షంలో వెంటనే జత చేసుకోండి.

ఆధార్‌ను జత చేయండిలా...

* ముందుగా ఈపీఎఫ్‌వో మెంబర్‌ పోర్టల్‌కు వెళ్లండి. మీ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వండి.

* మెనూ బార్‌లోని మేనేజ్‌ ఆప్షన్‌కు వెళ్లండి.

* అక్కడ డ్రాప్‌డౌన్‌ మెనూలోని కేవైసీ ఆప్షన్‌ను ఎంచుకోండి.

* మీకు అక్కడ పలు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఈపీఎఫ్‌తో ఆధార్ అనుసంధానం ఆప్షన్‌ ఎంచుకోండి.

* మీ ఆధార్‌ కార్డుపై ఉన్న విధంగా మీరు పేరు, ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయండి.

* ఒకసారి సేవ్‌ చేశాక యూఐడీఏఐ డేటాతో మీ ఆధార్‌ వివరాలను ఈపీఎఫ్‌వో సరిపోల్చుతుంది.

* అనుసంధానం పూర్తయ్యాక ఆధార్‌ వివరాలు తనిఖీ పూర్తయినట్లుగా మీకు వెరిఫైడ్‌ టిక్‌ మార్క్‌ చూపిస్తుంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని