భారత్‌ను వీడడం లేదు: ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ - No Plans to exit india says Franklin Templeton
close

Updated : 02/04/2021 20:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌ను వీడడం లేదు: ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌

దిల్లీ: భారత్‌లో తమ కార్యకలాపాలను మూసివేసే ప్రసక్తే లేదని మ్యూచుఫండ్ల (ఎంఎఫ్‌) సంస్థ ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ స్పష్టం చేసింది. గతేడాది ఆరు రకాల ఎంఎఫ్‌ పథకాలను సంస్థ మూసివేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియలో కొన్ని అవకతవకలు, అక్రమ లావాదేవీలు జరిగినట్లు అభియోగాలు ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగిన సెబీ ఈ విషయంపై దర్యాప్తు చేపట్టింది.

ఈ నేపథ్యంలో సెబీ నివేదిక సంస్థకు అనుకూలంగా లేని పక్షంలో భారత్‌లో కార్యకలాపాలకు స్వస్తి పలికేందుకు ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ యోచిస్తున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ వార్తల్ని తాజాగా సంస్థ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (ఇండియా) అధ్యక్షుడు ఎస్‌.సంజయ్‌ ఖండించారు. భారత్‌లో సంస్థ కొనసాగుతుందని స్పష్టం చేస్తూ మదుపర్లకు లేఖ రాశారు. ప్రభుత్వ, దర్యాప్తు సంస్థలకు తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. పథకాల మూసివేతకు గల కారణాలను అర్థం చేసుకోవడానికి సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. 

మరోవైపు పథకాల మూసివేతకంటే ముందుగానే ఫండ్‌ హౌస్‌కు చెందిన కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు రూ.50 కోట్లకుపైగా విలువైన పెట్టుబడులను రీడీమ్‌ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాలు ఆడిట్‌లో వెల్లడైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సెబీ చట్టపరమైన దర్యాప్తును చేపట్టింది. ఈ క్రమంలో ఈడీ సైతం మనీలాండరింగ్‌ ఆరోపణల కింద కేసు నమోదు చేసింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని