లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. జీడీపీ అంచనాలు కట్‌ - Nomura cuts Indias FY22 growth estimate
close

Published : 11/05/2021 22:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. జీడీపీ అంచనాలు కట్‌

దిల్లీ: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధిస్తున్న నేపథ్యంలో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు అంచనాలను జపనీస్‌ బ్రోకరేజీ సంస్థ నొమురా తగ్గించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 10.8 శాతంగా ఉంటుందని పేర్కొంది. గతంలో జీడీపీ 12.6 శాతంగా నమోదు అవుతుందని ఇదే సంస్థ అంచనా కట్టింది. సెకండ్‌ వేవ్‌ దృష్ట్యా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తుండడంతో కార్యకలాపాలు తగ్గడమే ఇందుకు కారణమని నొమురా పేర్కొంది. ఇప్పటికే ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిరేటు అంచనాలను 10.5 శాతంగా అంచనా వేసింది. ఈసారి వృద్ధిరేటు 8.2 శాతంగా నమోదయ్యే అవకాశం కూడా ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. గతేడాది జీడీపీ వృద్ధిరేటు 7.6 శాతం మేర క్షీణించిన సంగతి తెలిసిందే.

మూడీస్‌ కూడా..
మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ కూడా భారత జీడీపీ అంచనాలను సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 9.3 శాతంగా లెక్కగట్టింది. గతంలో 13.7 శాతం ఉంటుందని అంచనా వేసింది. సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉన్నప్పటికీ రెండో అర్ధభాగంలో పుంజుకుంటుందని అభిప్రాయపడింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని