close

Updated : 21/04/2021 10:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Flipkart Quick సేవలు హైదరాబాద్‌లోనూ

90 నిమిషాల్లో సరకు మీ ఇంట్లో

దిల్లీ: వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్, ఆర్డర్‌ తీసుకున్న 90 నిముషాల్లోనే సరకు అందించే  ‘ఫ్లిప్‌కార్ట్‌ క్విక్‌’ను హైదరాబాద్‌ సహా 6 నగరాలకు కొత్తగా విస్తరిస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది. హైదరాబాద్, దిల్లీ, గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా, పుణెల్లోనూ ఈ సేవలు అందిస్తామని తెలిపింది. బెంగళూరులో గత ఏడాది ఈ సేవలను ప్రారంభించింది. 3,000కు పైగా ఉత్పత్తుల్ని (తాజా పండ్లు, కూరగాయలు, డైరీ, మాంసం, గ్రోసరీ, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, బేబీ కేర్‌) వేగంగా డెలివరీ చేస్తామని, వినియోగదార్లు తమకు అనువైన సమయాన్ని ఎంపిక చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని