Nykaa IPO : 28న నైకా ఐపీఓకి సిద్ధమవుతున్నారా? పూర్తి వివరాలివిగో..! - Nykaa IPO Will open 28 oct and its full details
close

Updated : 23/10/2021 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nykaa IPO : 28న నైకా ఐపీఓకి సిద్ధమవుతున్నారా? పూర్తి వివరాలివిగో..!

దిల్లీ: నైకా బ్రాండ్‌ పేరుతో సౌందర్య ఉత్పత్తులు విక్రయించే ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఇ-కామర్స్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) అక్టోబరు 28న మొదలై నవంబరు 1న ముగియనుంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.5,352 కోట్లు సమీకరించాలని చూస్తోంది. ముసాయిదా పత్రాల ప్రకారం.. తాజాగా రూ.630 కోట్ల ఈక్విటీ షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో 41,972,660 ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, తాజా వాటాదార్లు విక్రయించనున్నారు. ఇంతకు ముందు తాజా ఇష్యూ పరిమాణం రూ.525 కోట్లుగా ఉంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో షేర్లను విక్రయిస్తున్న వారిలో ప్రమోటర్‌ సంజయ్‌ నాయర్‌ ఫ్యామిలీ ట్రస్ట్‌,  వాటాదార్లు అయిన టీపీజీ గ్రోత్‌ 4 ఎస్‌ఎఫ్‌, లైట్‌హౌస్‌ ఇండియా ఫండ్‌ 3, లైట్‌హౌస్‌ ఇండియా 3 ఎంప్లాయి ట్రస్ట్‌, యోగేశ్‌ ఏజెన్సీస్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, జేఎం ఫైనాన్షియల్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఉన్నాయి. ఇష్యూ ధరలో గరిష్ఠమైన రూ.1125ను లెక్కలోకి తీసుకుంటే ఈ ఐపీఓ ద్వారా నైకాకు రూ.5,325 కోట్లు రావొచ్చు. ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను కొత్త రిటైల్‌ స్టోర్ల ఏర్పాటు, గోదాములు నెలకొల్పడానికి కంపెనీ వినియోగించనుంది. కొంత రుణభారాన్ని సైతం తగ్గించుకోనుంది.

ఐపీఓ లక్ష్యం: కొత్త రిటైల్‌ స్టోర్ల ఏర్పాటు, గోదాములు నెలకొల్పడానికి కంపెనీ వినియోగించనుంది. కొంత రుణభారాన్ని సైతం తగ్గించుకోనుంది.

ఈ ఐపీఓకి సంబంధించిన వివరాలు...

ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభ తేదీ: అక్టోబరు 28, 2021
ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ముగింపు తేదీ: నవంబరు 1, 2021
బేసిస్‌ ఆఫ్‌ అలాట్‌మెంట్‌ తేదీ: నవంబరు 8, 2021
రీఫండ్‌ ప్రారంభ తేదీ: నవంబరు 9, 2021
డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ తేదీ: నవంబరు 10, 2021
మార్కెట్‌లో లిస్టయ్యే తేదీ: నవంబరు 11, 2021

ముఖ విలువ: రూ.01 (ఒక్కో ఈక్విటీ షేరుకు)
లాట్‌ సైజు: 12 షేర్లు
కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 12 (ఒక లాట్‌)
గరిష్ఠంగా ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 168 (12 లాట్లు)
ఐపీఓ ధర శ్రేణి: రూ.1085-1125 (ఒక్కో ఈక్విటీ షేరుకు)

సంస్థ ఇతర వివరాలు...

2012లో ప్రారంభమైన నైకా.. సౌందర్య ఉత్పత్తులు, పర్సనల్‌ కేర్‌, ఫ్యాషన్‌ ప్రోడక్ట్స్‌ను ఆన్‌లైన్‌ వేదికగా విక్రయిస్తోంది. సొంత బ్రాండ్‌ ఉత్పత్తులను కూడా అమ్ముతోంది. మొత్తం 2,476 బ్రాండ్లకు సంబంధించిన 1,97,195 రకాల(ఎస్‌కేయూ) ఉత్పత్తులను విక్రయిస్తోంది. థర్డ్‌ పార్టీ కంపెనీలు తయారు చేస్తున్న కొన్ని ఉత్పత్తులను నైకా కాస్మొటిక్స్‌, నైకా నేచురల్స్‌, కే బ్యూటీ పేరిట సొంత బ్రాండింగ్‌పై అమ్ముతోంది. మంగళవారం డాట్‌ అండ్‌ కీ అనే ప్రీమియం సౌందర్య ఉత్పత్తుల కంపెనీలోనూ మెజారిటీ వాటాలు సొంతం చేసుకుంది. ఇక వస్త్ర విభాగంలో మొత్తం 1,350 బ్రాండ్లకు చెందిన 1.8 మిలియన్‌ ఎస్‌కేయూలను విక్రయిస్తోంది. మొబైల్‌ యాప్స్‌, ఆన్‌లైన్‌ ఛానెల్స్‌, వెబ్‌సైట్ల వంటి డిజిటల్‌ వేదికలతో పాటు 38 నగరాల్లో ఉన్న 73 భౌతిక కేంద్రాల్లోనూ నైకా తమ ఉత్పత్తులను అమ్ముతోంది. 

ఆర్థిక వివరాలు(రూ.కోట్లలో)

సంవత్సరం        ఆదాయం       ఆస్తులు        లాభాలు

2019             1,116            776          - 24.54          

2020            1,778             1,124        - 16.34

2021            2,453             1,302         61.94  


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని