Nykaa IPO: నైకా ఐపీఓ ఎప్పుడు ప్రారంభమవుతోందంటే..? - Nykaa releases IPO launch date
close

Updated : 22/10/2021 15:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nykaa IPO: నైకా ఐపీఓ ఎప్పుడు ప్రారంభమవుతోందంటే..?

ముంబయి: ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈ-కామర్స్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ నేతృత్వంలోని బ్యూటీ ఉత్పత్తుల అంకుర సంస్థ నైకా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ఈ నెల 28న ప్రారంభం కానుంది. నవంబర్ 1న ముగుస్తుంది. మొత్తం రూ.5,200 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో తాజా షేర్ల ద్వారా రూ.630 కోట్లు కాగా.. మరో 41,972,660 షేర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనున్నారు. కంపెనీ విలువను 7.4 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. మాజీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ ఫల్గుని నాయర్ నేతృత్వంలోని ఈ సంస్థ 2012లో ప్రారంభమైంది. ప్రస్తుతం బ్యూటీ ఉత్పత్తులకు ప్రధాన ఆన్‌లైన్‌ కేంద్రంగా మారింది. కంపెనీకి గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,440 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. పలు ప్రముఖ కంపెనీలకు చెందిన ఉత్పత్తులతో పాటు సొంతంగా బ్రాండ్లను కూడా నైకా విక్రయిస్తోంది. ఈ సంస్థ అమ్మకాల పోర్ట్‌ఫోలియోలో 1,500 వరకు బ్రాండ్‌లున్నాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని