Oyo IPO: ఓయో రూ.8,430 కోట్ల ఐపీఓ..సెబీకి దరఖాస్తు - OYO seeks Sebi nod for Rs 8430 cr IPO
close

Updated : 02/10/2021 09:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oyo IPO: ఓయో రూ.8,430 కోట్ల ఐపీఓ..సెబీకి దరఖాస్తు

దిల్లీ: ఆతిథ్య సేవల సంస్థ ఓయో తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా రూ.8,430 కోట్లు సమీకరించడానికి సిద్ధమైంది. ఈ మేరకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద కంపెనీ శుక్రవారం ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ప్రతిపాదిత ఇష్యూలో రూ.7,000 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో రూ.1,430 కోట్ల విలువైన షేర్లను కంపెనీ విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో ఎస్‌వీఎఎఫ్‌ ఇండియా హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, ఏ1 హోల్డింగ్స్‌, చైనా లాడ్జింగ్‌ హోల్డింగ్స్‌, గ్లోబల్‌ ఐవీవై వెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీ షేర్లను విక్రయించనున్నాయి. ప్రస్తుతం ఓయోలో ఎస్‌వీఎఎఫ్‌ 46.62%, ఆర్‌ఏ హాస్పిటాలిటీ హోల్డింగ్స్‌కు 24.94%, రితేశ్‌ అగర్వాల్‌కు 8.21% వాటాలు ఉన్నాయి. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు, వాణిజ్య విస్తరణకు కంపెనీ వినియోగించనుంది.  ఈ పబ్లిక్‌ ఇష్యూ నిర్వహించేందుకు జేపీ మోర్గాన్, సిటీ, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ వంటి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌లను ఓయో నియమించుకుంది. ఈ ఏడాది జులైలో జొమాటో ఐపీఓ విజయవంతమైన తర్వాత పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు ఓయో సిద్ధమైంది. ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా మార్చేందుకు ఓయో మాతృ సంస్థ ఓరావెల్‌ స్టేస్‌ వాటాదార్లు ఇటీవల ఆమోదం తెలిపారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని