సగానికి పడిపోయిన అరామ్‌కో లాభాలు! - Oil giant Saudi Aramco sees 2020 profits drop to USD 49 billion
close

Published : 21/03/2021 16:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సగానికి పడిపోయిన అరామ్‌కో లాభాలు!

రియాద్‌ : చమురు దిగ్గజ సంస్థ సౌదీ అరామ్‌కో గతేడాది లాభాలు దాదాపు సగానికి పడిపోయి 49 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో చమురు ధరలు, ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. 2019, డిసెంబరులో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన తర్వాత సౌదీ అరామ్‌కో ప్రకటించిన రెండో వార్షిక ఫలితాలు ఇవి. 2018లో అరామ్‌కో 111.2 బిలియన్‌ డాలర్ల లాభాన్ని ఆర్జించగా.. 2019లో అది 88.2 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. ఇక 2020లో మరింత క్షీణించి 49 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది.

అయితే, ముందు ప్రకటించినట్లుగా తమ కంపెనీ వాటాదార్లకు అయిదేళ్లపాటు ఏడాదికి 75 బిలియన్‌ డాలర్ల చొప్పున డివిడెండు చెల్లిస్తామని తెలిపింది. అయితే ఈ ఆదాయంలో చాలా వరకు సౌదీ ప్రభుత్వానికే వెళ్లనుంది. ఎందుకంటే కంపెనీలో 98 శాతం వాటాలు ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా రవాణా స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో చమురు గిరాకీ తగ్గి ధరలు భారీ స్థాయిలో పతనమయ్యాయి. అయితే, వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం, లాక్‌డౌన్‌లు ముగియడంతో అంతర్జాతీయంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. చమురు గిరాకీ సైతం పుంజుకుంది. రవాణా సదుపాయాలను పునరుద్ధరించారు. దీంతో చమురు ధరలు మరోసారి పెరుగుతున్నాయి.

ఇవీ చదవండి..

టెలికాం ఛార్జీల పెంపు ఇప్పట్లో లేనట్లే!

జనవరిలో కొత్తగా 13.36 లక్షల ఉద్యోగాలు!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని