ఒకాయా విద్యుత్‌ స్కూటర్‌ ఫ్రీడమ్‌ - Okaya Electric Scooter Freedom
close

Updated : 17/09/2021 09:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకాయా విద్యుత్‌ స్కూటర్‌ ఫ్రీడమ్‌

ప్రారంభ ధర రూ.69,900

దిల్లీ: ఇంధన నిల్వ సొల్యూషన్ల సంస్థ ఒకాయా గ్రూప్‌నకు చెందిన విద్యుత్‌ వాహన అనుబంధ సంస్థ గురువారం తమ కొత్త విద్యుత్‌ స్కూటర్‌ ఫ్రీడమ్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.69,900. కంపెనీ ఇప్పటికే అవియాన్‌ఐక్యూ, క్లాస్‌ఐక్యూ శ్రేణుల్లో రెండు విద్యుత్‌ స్కూటర్లను విక్రయిస్తోంది. లిథియమ్‌-అయాన్‌, లెడ్‌-యాసిడ్‌ బ్యాటరీలతో ఫ్రీడమ్‌ 4 వేరియంట్లలో లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే గరిష్ఠంగా సుమారు 250 కి.మీ. ప్రయాణించవచ్చని ఒకాయా పవర్‌ గ్రూప్‌ ఎండీ అనిల్‌ గుప్తా వెల్లడించారు.


11 దేశాలకు నగదు బదిలీపై  25% వరకు ఛార్జీల తగ్గింపు: వైజ్‌

దిల్లీ: భారత్‌ నుంచి 11 దేశాలకు జరిపే నగదు లావాదేవీలపై విధించే ఛార్జీలను సగటున 25 శాతం వరకు తగ్గించినట్లు ఫారెక్స్‌ సేవల కంపెనీ వైజ్‌ ప్రకటించింది. ఈ దేశాల జాబితాలో అమెరికా, కెనడా, మలేషియా, టర్కీ, బంగ్లాదేశ్‌, పోలాండ్‌, హంగేరీ, రొమేనియా, బల్గేరియా, క్రొయేషియా, చిలీలున్నాయి. ఈ దేశాలకు లావాదేవీలు పెరగడంతో ఛార్జీలను తగ్గించినట్లు తెలుస్తోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని