Ola Scooter: 24 గంటల్లో లక్ష బుకింగ్‌లు - Ola Electric Scooter Receives Over 1 Lakh Reservations In 24 Hours
close

Published : 17/07/2021 16:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ola Scooter: 24 గంటల్లో లక్ష బుకింగ్‌లు

దిల్లీ: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల బుకింగ్‌లు ప్రారంభమైన తొలి 24 గంటల్లో లక్ష మంది రిజర్వ్‌ చేసుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలో విపణిలోకి విడుదల చేయనున్న ఈ విద్యుత్తు స్కూటర్ల బుకింగ్‌లు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఓలాఎలక్ట్రిక్‌.కామ్‌లో రూ.499 రిఫండబుల్‌ డిపాజిట్‌ చెల్లించి ఈ స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. వినియోగదారుల నుంచి అందిన స్పందన పట్ల ఓలా ఛైర్మన్, గ్రూపు సీఈఓ భావిశ్‌ అగర్వాల్‌ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రత్యేకతలను కంపెనీ ఇప్పటివరకు వెల్లడించలేదు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని