close

తాజా వార్తలు

Updated : 18/10/2020 04:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పుంజుకుంటున్నా.. అది బలహీనంగానే

భారత ఆర్థిక వ్యవస్థపై బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ నివేదిక
2020-21లో వృద్ధి -9.5 శాతంగా అంచనా

దిల్లీ: కొన్ని కీలక స్థూల ఆర్థిక గణాంకాల ప్రకారం ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతున్నట్లుగా తెలుస్తున్నప్పటికీ.. ఈ పుంజుకోవడం బలహీనంగా ఉందనే సంకేతాలూ కన్పిస్తున్నాయని ఓ నివేదిక తెలిపింది. బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. జులై- సెప్టెంబరులో భారత వృద్ధి -13.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు తక్షణ చర్యలను ప్రభుత్వం చేపట్టకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు -9.5 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. ‘కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ పరిణామాల నేపథ్యంలో ఆరు నెలల పాటు ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. అయితే ఎట్టకేలకు సానుకూల సంకేతాలు కన్పిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నట్లుగా కొన్ని కీలక సూచీలు తెలియజేస్తున్నాయ’ని నివేదిక పేర్కొంది. ఆగస్టులో తయారీ పీఎంఐ సూచీ 52 పాయింట్ల వద్ద ఉండగా.. సెప్టెంబరులో 56.8 పాయింట్లకు పెరిగింది. ఎనిమిదేళ్లలోనే ఇది గరిష్ఠ స్థాయి. ఏడాదిక్రితంతో పోలిస్తే సెప్టెంబరులో జీఎస్‌టీ వసూళ్లు 3.8 శాతం పెరిగి రూ.95,480 కోట్లకు చేరాయి. ఆగస్టుతో పోలిస్తే 10 శాతం పెరిగాయి. ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు 31%, రైలు రవాణా రద్దీ 15 శాతం మేరకు పెరిగాయి. ఆరు నెలల తర్వాత ఎగుమతుల్లోనూ 5.3 శాతం మేర వృద్ధి కన్పిస్తోంది. అదే సమయంలో వృద్ధి పుంజుకోవడం బలహీనంగానే ఉందనే సంకేతాలూ కొన్ని గణాంకాలు తెలియజేస్తున్నాయని నివేదిక పేర్కొంది. కొత్త ప్రాజెక్టులపై మూలధన వ్యయాలు 81 శాతం తగ్గాయని తెలిపింది. పెట్టుబడులు తగ్గడం కొనసాగుతోందనే విషయాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయని వెల్లడించింది. కీలక రంగాల వృద్ధి ఆగస్టులో -8.5 శాతంగా నమోదుకావడం కూడా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంలో బలహీనతను సూచిస్తోందని పేర్కొంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.