Covid Ads: విన్నారా.. 332 కొవిడ్‌ ప్రకటనల్లో 12 మాత్రమే సరైనవట! - Only 12 ou od 332 ads are correct in covid related ads
close

Published : 26/07/2021 15:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid Ads: విన్నారా.. 332 కొవిడ్‌ ప్రకటనల్లో 12 మాత్రమే సరైనవట!

దిల్లీ: వివిధ వాణిజ్య ప్రకటనలు తప్పుదోవ పట్టిస్తున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో అడ్వర్‌టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌సీఐ) గత ఆర్థిక సంవత్సరంలో 6,140 యాడ్లను పరిశీలించింది. వీటిలో కొవిడ్‌ సంబంధమైనవి 332 ప్రకటనలు ఉండగా.. 12 మాత్రమే శాస్త్రీయంగా సరైనవని ఏఎస్‌సీఐ తేల్చింది. ప్రకటనల్ని పరిశీలించిన బృందాల్లో మైక్రోబయాలజిస్ట్‌ల వంటి నిపుణులు కూడా ఉన్నారు.

ప్రకటనల్లో అవాస్తవాలను నియంత్రించాలని ఆయుష్‌ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు ఏఎస్‌సీఐ చర్యలు చేపట్టింది. ఏప్రిల్‌ 1 తర్వాత మొత్తం 237 అభ్యంతరకర ప్రకటనల్ని మంత్రిత్వశాఖ దృష్టికి తెచ్చింది. వీటిలో ప్రకటనకర్తలు 164 యాడ్లలో తగు మార్పులు చేశారు. మరో 73 ప్రకటనలపై మరింత లోతైన పరిశీలన జరపాల్సి ఉంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వీటిపై మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుంది.

ప్రజల కరోనా సంబంధింత ఆందోళనను పలు సంస్థలు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాయని ఏఎస్‌సీఐ సెక్రటరీ జనరల్‌ మనీషా కపూర్‌ స్పష్టం చేశారు. వీటిలో ఆహార, రంగులు, సబ్బులు, లేపనాలు, వాటర్‌ ప్యూరిఫయర్లు, ప్లైవుడ్‌లు సహా పలు ఉత్పత్తుల ప్రకటనలు ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు విద్యారంగంలో 1,406, ఆహారం-పానీయాల రంగంలో 147 సహా మరికొన్ని రంగాల్లో 364 ప్రకటనలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని