ఐడీబీఐ బ్యాంక్‌ ఖాతాదారులకు ఏడాదికి 20 చెక్కులే ఉచితం - Only 20 checks per year are free for IDBI Bank customers
close

Published : 12/06/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐడీబీఐ బ్యాంక్‌ ఖాతాదారులకు ఏడాదికి 20 చెక్కులే ఉచితం

దిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ జులై 1 నుంచి పలు సేవలపై ఛార్జీలను సవరించింది. ఏడాదికి 20 ఉచిత చెక్కులను మాత్రమే ఖాతాదారులకు ఉచితంగా అందించనుంది. ఆపైన ప్రతి చెక్కుకు రూ.5 వసూలు చేయనుంది. ప్రస్తుతం వినియోగదారుడు ఖాతా తెరిచిన మొదటి ఏడాదిలో ఎటువంటి ఛార్జీలు లేకుండా 60 చెక్కులను బ్యాంక్‌ అందిస్తోంది. ఆ తర్వాతి సంవత్సరాల్లో 50 చెక్కులను ఇస్తోంది. ఆపైన మాత్రమే ఒక్కోదానిపై రూ.5 వసూలు చేస్తోంది. ‘సబ్‌కా సేవింగ్‌ అకౌంట్‌’ ఖాతాదారులకు మాత్రం ఈ పెంపు వర్తించదని, ఏడాదికి అపరిమిత చెక్కులను పొందొచ్చని ఐడీబీఐ బ్యాంక్‌ వెల్లడించింది.

సంక్షిప్తంగా..
ఔషధ సంస్థ ట్రోఫిక్‌ వెల్‌నెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో అదనంగా 13.09 శాతం వాటాను రూ.21.20 కోట్లతో కొనుగోలు చేసినట్లు ఇప్కా ల్యాబ్స్‌ వెల్లడించింది. దీంతో మొత్తం వాటా 52.35 శాతానికి చేరిందని పేర్కొంది.
ప్రస్తుతం ఉన్న రుణ పరిమితిని రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.2.25 లక్షల కోట్లకు పెంచుకునే ప్రతిపాదనను, బోర్డు ఈ నెలాఖరులో నిర్వహించే సమావేశంలో పరిశీలించే అవకాశం ఉందని ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ వెల్లడించింది.
ఎంపిక చేసిన హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు తమ అంతర్గత ఆడిట్‌ వ్యవస్థలో నాణ్యత, సమర్థతను పెంచుకునేందుకు వీలుగా రిస్క్‌ ఆధారిత అంతర్గత ఆడిట్‌ (ఆర్‌బీఐఏ) నిర్వహించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి ఇచ్చింది.
యూకేకు చెందిన దిగ్గజ ఎయిర్‌లైన్స్‌ వర్జిన్‌ అట్లాంటిక్‌ ‘కొత్త దశ’ ప్రారంభించడానికి సహాయం చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరుచుకున్నట్లు టీసీఎస్‌ తెలిపింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని