మోల్నుపిరవిర్‌ తయారీకి సిద్ధం: ఆప్టిమస్‌ ఫార్మా - Optimus Pharma ready to manufacturing Molnupiravir
close

Published : 22/07/2021 15:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోల్నుపిరవిర్‌ తయారీకి సిద్ధం: ఆప్టిమస్‌ ఫార్మా

ఈనాడు, హైదరాబాద్‌: స్వల్ప, మధ్య స్థాయి కొవిడ్‌-19 లక్షణాలతో బాధపడుతున్న వారిపై నిర్వహించిన మోల్నుపిరవిర్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షల్లో ఆశాజనక ఫలితాలు వచ్చినట్లు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆప్టిమస్‌ ఫార్మా వెల్లడించింది. మోల్నుపిరవిర్‌ యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ పదార్థం (ఏపీఐ) ఉత్పత్తికి సంబంధించిన సూత్రీకరణనూ అభివృద్ధి చేస్తున్నట్లు ఆప్టిమస్‌ ఛైర్మన్‌, ఎండీ డాక్టర్‌ డి శ్రీనివాస్‌ రెడ్డి బుధవారం వెల్లడించారు. మొత్తం 1218 మందిపై క్లినికల్‌ పరీక్షలు నిర్వహించామని, 353 మందిపై నిర్వహించిన ప్రయోగాలకు సంబంధించిన మధ్యంతర ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. చికిత్స 5-28 రోజుల వరకు ఉంటుందని తెలిపారు. 10, 14 రోజు నాటికి ఈ ఔషధం మంచి పనితీరును చూపించడంతోపాటు, ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలో నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. చికిత్స వ్యవధిలో, తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు, అనారోగ్యం బారిన పడకుండా ఈ ఔషధం భద్రతనిస్తుందని తెలిపారు. అందువల్ల ఆప్టిమస్‌ ఫార్మా మోల్నుపిరవిర్‌ ఉత్పత్తికి సిద్ధం అవుతోందని వెల్లడించారు. అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డీసీజీఐని సంప్రదించినట్లు తెలిపారు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని