ఒపెక్‌ దేశాల నుంచి ఆక్సిజన్‌ సరఫరా - Oxygen supply from OPEC countries
close

Published : 08/05/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒపెక్‌ దేశాల నుంచి ఆక్సిజన్‌ సరఫరా

 కేంద్ర చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

దిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారిపై పోరు సాగించేందుకు అవసరమైన వైద్య అవసరాలకు ఉపయోగపడే ఆక్సిజన్‌ కోసం భారత్‌ ఒపెక్‌ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌ల వైపు చూస్తోంది.   కేంద్ర చమురు శాఖ మంత్రి ఈ మేరకు చర్చలు జరిపారు. భారత్‌కు వైద్య ఆక్సిజన్‌ ఎగుమతి చేసేందుకు యూఏఈ, కువైట్‌, బహ్రెయిన్‌, సౌదీ అరేబియాలు అంగీకరించినట్లు మంత్రి ప్రధాన్‌ ట్వీట్‌ చేశారు. ఐఓసీ, గెయిల్‌లు ఆక్సిజన్‌ రవాణాకు లాజిస్టిక్స్‌ సమకూరుస్తాయని తెలిపారు.
వేగంగా కొవిడ్‌-19 వనరుల బదిలీ

కస్టమ్స్‌తో తపాలా శాఖ జట్టు
దిల్లీ: ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, పరికరాలు, ఔషధాలు వంటి కొవిడ్‌-19 వనరులను వేగంగా క్లియర్‌ చేయడం, ప్రాసెసింగ్‌, బదిలీ కోసం కస్టమ్స్‌ సంస్థలతో తపాలా శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుంది. కొవిడ్‌-19 వనరుల డెలివరీ వేగవంతానికి కన్‌సైన్‌మెంట్‌ వివరాలను ఇ-మెయిల్‌ లేదా వాట్సాప్‌ ద్వారా నోడల్‌ అధికారులకు పంపించాల్సిందిగా వినియోగదారులను తపాలా శాఖ కోరింది. కన్‌సైన్‌మెంట్‌ పేరు, మొబైల్‌ సంఖ్య, ఇ-మెయిల్‌ ఐడీ, ట్రాకింగ్‌ ఐడీ, పంపిన తేదీ, డెలివరీ చిరునామా వంటి వాటిని ఇ-మెయిల్‌ ద్వారా పంపమని సూచించింది. రెండు ఇ-మెయిల్‌ ఐడీలు
adgim2@indiapost.gov.inand dop.covid19@gmail.com లను తపాలా శాఖ పేర్కొంది. నోడల్‌ అధికారులుగా అరవింద్‌ కుమార్‌, పునీత్‌ కుమార్‌లను నియమించిన సంస్థ.. వీరిని 98683378497, 9536623331లపై సంప్రదించొచ్చని వెల్లడించింది.
సంక్షిప్తంగా..
*సేవలు అందించే నెఫ్రోప్లస్‌ పుణేలో ‘డయాలసిస్‌ ఆన్‌ వీల్స్‌’ను అందుబాటులోకి తెచ్చింది. కొవిడ్‌-19 నేపథ్యంలో చాలామంది డయాలసిస్‌ రోగులకు ఇబ్బంది ఎదురవుతున్న దృష్ట్యా అంబులెన్స్‌లోనే ఈ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని