Oyo IPO: ఓయో రూ.8000 కోట్ల ఐపీఓ - Oyo to Seek at Least 1.2 Billion Dollar in IPO
close

Updated : 24/09/2021 14:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oyo IPO: ఓయో రూ.8000 కోట్ల ఐపీఓ

వచ్చే వారం దరఖాస్తు చేసే అవకాశం!

దిల్లీ: ఆతిథ్య సేవల సంస్థ ఓయో తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా 1.2 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.8000 కోట్లు) వరకు సమీకరించడానికి సన్నాహాలు చేస్తోంది. వచ్చే వారం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద కంపెనీ ముసాయిదా పత్రాలు దాఖలు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పబ్లిక్‌ ఇష్యూ నిర్వహించేందుకు జేపీ మోర్గాన్, సిటీ, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ వంటి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌లను ఓయో నియమించుకుంది. అయితే దీనిపై ఓయో స్పందించలేదు. ఈ ఏడాది జులైలో జొమాటో ఐపీఓ విజయవంతమైన తర్వాత పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు ఓయో సిద్ధమైంది. గత వారం ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా మార్చేందుకు ఓయో మాతృ సంస్థ ఓరావెల్‌ స్టేస్‌ వాటాదార్లు ఆమోదం తెలిపారు.

పరాస్‌ ఐపీఓకు 304 రెట్ల స్పందన...

పరాస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) చివరి రోజుకు ఏకంగా 304.05 రెట్ల స్పందన వచ్చింది. ఇష్యూలో భాగంగా 71,40,793 షేర్లు జారీ చేయగా.. 2,17,11,27,120 షేర్ల బిడ్లు దాఖలయ్యాయి. అర్హులైన సంస్థాగత మదుపర్ల విభాగంలో 169.65 రెట్లు, సంస్థాగతేతర మదుపర్ల విభాగంలో 927.70 రెట్లు చొప్పున స్పందన లభించింది. మరోవైపు చిన్న మదుపర్ల నుంచి 112.39 రెట్ల స్పందన కనిపించింది. ఈ ఇష్యూ ద్వారా సంస్థ రూ.170 కోట్లు సమీకరించనుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని