కేంద్రం దన్నుతో రూ.40లక్షల కోట్ల అదనపు ఆదాయం! - PLI scheme can generate Huge incremental revenue says crisil report
close

Published : 10/03/2021 17:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేంద్రం దన్నుతో రూ.40లక్షల కోట్ల అదనపు ఆదాయం!

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలపై క్రిసిల్‌ నివేదిక

దిల్లీ: దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్ఐ)’ను ప్రకటిస్తోంది. దీని వల్ల ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉందని ఓ ప్రముఖ నివేదిక వెల్లడించింది. దాదాపు 14 రంగాల్లో రానున్న ఐదేళ్లలో రూ.35-40 లక్షల కోట్ల అదనపు ఆదాయం సమకూరనుందని క్రిసిల్‌ అంచనా వేసింది. మహమ్మారి విజృంభణ సమయంలో చైనాను వీడిన పెట్టుబడిదారులను ఆకర్షించే లక్ష్యంతో కేంద్రం ప్రత్యేక పీఎల్‌ఐలకు శ్రీకారం చుట్టింది. వివిధ రంగాల్లో దాదాపు రూ. 1.8 లక్షల కోట్ల విలువైన రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించనుంది.

పీఎల్‌ఐ వల్ల లభించిన దన్నుతో రానున్న 24-30 నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. మూలధన వ్యయం కొత్తగా దాదాపు 2-2.7 లక్షల కోట్లు పెరగనున్నట్లు అంచనా. ఐటీ హార్డ్‌వేర్‌, టెలికాం పరికరాలు, ఎలక్ట్రానిక్స్‌, మొబైల్‌ ఫోన్లు వంటి రంగాల్లో దేశీయ తయారీ బలహీనంగా ఉందని పేర్కొంది. తాజాగా ప్రకటించిన పీఎల్‌ఐల వల్ల ఈ రంగాల్లో మూలధన వ్యయం దాదాపు 3.5 శాతం పుంజుకోనుందని తెలిపింది. అలాగే 2022లో పారిశ్రామిక పెట్టుబడుల్లో మూలధన వ్యయం వాటా 45-50 శాతానికి పెరగనున్నట్లు అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 35 శాతం కుంగిన విషయం తెలిసిందే. బ్యాంకు రుణాలకు సైతం డిమాండ్‌ పెరగనుందని తెలిపింది. ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తాయని అభిప్రాయపడింది.

ఇవీ చదవండి...

కొవిడ్‌ భయం..కొత్త పాలసీలు జూమ్‌

ఓటీపీలు ఆగాయ్‌..లావాదేవీలు నిలిచాయ్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని