PNB: ‘కనీస బ్యాలెన్స్‌’ ఛార్జీలు.. పీఎన్‌బీకి రూ.170కోట్ల ఆదాయం - PNB earns Rs 170 cr in FY21 by levying charges on non-maintenance of minimum balance
close

Published : 20/09/2021 19:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PNB: ‘కనీస బ్యాలెన్స్‌’ ఛార్జీలు.. పీఎన్‌బీకి రూ.170కోట్ల ఆదాయం

దిల్లీ: ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ ఉంచని ఖాతాదారులపై ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) ఛార్జీలు విధిస్తోంది. ఈ ఛార్జీలతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో పీఎన్‌బీ బ్యాంక్‌ దాదాపు రూ.170కోట్ల మేర వసూలు చేసింది. ఈ మేరకు సహ చట్టం ద్వారా వెల్లడైంది. ఛార్జీల రూపంలో బ్యాంకుకు లభించిన ఆదాయంపై మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త సహచట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా.. పీఎన్‌బీ సమాధానమిచ్చింది. 

అయితే అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో కనీస బ్యాలెన్స్‌ నిర్వహణపై బ్యాంకు ఆదాయం కాస్త తగ్గింది. 2019-20 ఈ ఆదాయం రూ.286.24కోట్లుగా ఉంది. ఇక ఏటీఎం లావాదేవీలపై ఛార్జీల రూపంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో పీఎన్‌బీ రూ.74.28కోట్లు వసూలు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏటీఎం ఛార్జీల కింద రూ.114.08కోట్ల ఆదాయం రాగా.. గతేడాది కాస్త తగ్గింది. కరోనా నేపథ్యంలో 2020-21 తొలి త్రైమాసికంలో బ్యాంకు ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేసిన విషయం తెలిసిందే. 


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని