e auction: రేపు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఇ-వేలం - PNB mega e auction for properties
close

Updated : 14/06/2021 16:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

e auction: రేపు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఇ-వేలం

ఇంటర్నెట్‌డెస్క్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రేపు భారీ ఇ-వేలం నిర్వహించనుంది. తాకట్టులో ఉన్న ఆస్తులను ఇది విక్రయించనుంది. దీనిని పీఎన్‌బీ ఇ-ఆక్షన్‌ విభాగం నిర్వహిస్తుంది. వేలానికి రానున్న ఆస్తుల్లో ఇళ్లు, నివాస ప్రాంగణాలు, వాణిజ్య సముదాయాలు, పారిశ్రామిక సముదాయాలు  ఉండనున్నాయని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ట్విటర్‌లో ప్రకటించింది.  ఇందులో పాల్గొనాలనుకున్నే బిడ్డర్లు కొన్ని నిబంధనలను పూర్తి చేయాలి. ఇ-బిక్రి పోర్టల్‌ లెక్క ప్రకారం తాజా వేలంలో 12,855 నివాసాలు, 2,804 వాణిజ్య స్థలాలు, 1,400 పారిశ్రామిక ఆస్తులు, 101 వ్యవసాయ భూములు ఉన్నట్లు సమాచారం. 

* బిడ్డర్‌ లేదా కొనుగోలుదారుడిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. మొబైల్‌ ఫోన్‌ నెంబర్‌, ఈమెయిల్‌ సాయంతో ఇ-ఆక్షన్‌ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి.  కేవైసీ తనిఖీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన కేవైసీ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. దీనిని ఇ ఆక్షన్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ దీనిని తనిఖీ చేయాలి. బిడ్‌లో పాల్గొనడానికి అవసరమైన ఈఎండీ సొమ్మును ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో బదిలీ చేయాలి. ఇవి మొత్తం పూర్తి అయ్యాక ఇ-ఆక్షన్‌ ప్లాట్‌ఫామ్‌లో బిడ్లను దాఖలు చేయాలి. 



మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని