క్రెడిట్ స్కోరుపై  పే-లేట‌ర్ స‌ర్వీసులు ప్ర‌భావం చూపుతాయ‌ని మీకు తెలుసా?  - Pay-later-services-can-impact-your-credit-score
close

Updated : 05/05/2021 14:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రెడిట్ స్కోరుపై  పే-లేట‌ర్ స‌ర్వీసులు ప్ర‌భావం చూపుతాయ‌ని మీకు తెలుసా? 

క్రెడిట్ రిపోర్టు ప‌రిశీలించిన‌ప్పుడు, మీరు ఎప్పుడూ సంప్ర‌దించ‌ని  రుణ‌దాత‌ల నుంచి రుణం తీసుకున్న‌ట్లు ఉంద‌ని ఆశ్చ‌ర్య పోతున్నారా.. ఇందులో వింత ఏమీ లేదు.. ఈ రుణ‌దాతలు.. మీరు ఇటీవ‌ల కాలంలో పేలేట‌ర్‌, పోస్ట్‌-పేయిడ్ సేవ‌ల‌ను పొందిన‌ ఇ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్‌ల భాగ‌స్వాములు అయ్యే అవ‌కాశం ఉంది. 

ఉదాహ‌ర‌ణ‌కి, అమెజాన్ ఇండియాను తీసుకోండి. ఈ సంస్థ వెబ్‌సైట్  ప్ర‌కారం పే లేట‌ర్ సేవ‌ల‌కు క్యాపిట‌ల్ ఫ్లోట్‌, ఐడీఎఫ్‌సి ఫ‌స్ట్ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒక‌వేళ మీరు అమెజాన్ ఇండియా వారి పే-లేట‌ర్ సేవ‌ల‌ను వినియోగించుకుని వుంటే..ఈ రెండింటిలో ఏదో ఒక సంస్థ నుంచి ఆమోదించిన క్రెడిట్ లైన్ తీసుకున్న‌ట్లు మీ క్రెడిట్ నివేదికలో క‌నిపిస్తుంది. 

అదేవిధంగా, ఓలా మ‌నీ - ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ (ఎబిఎఫ్ఎల్) తో ఒప్పందం కుదుర్చుకుంది. మీరు ఓలా మనీ పోస్ట్‌పెయిడ్ కోసం సైన‌ప్ చేసి ఉంటే,  ఎబిఎఫ్ఎల్ నుంచి రుణం మంజూరైన‌ట్లు క్రెడిట్ నివేదిక తెలుపుతుంది. 

ఎంబెడెడ్‌ ఫైనాన్స్ .. 
ఇటువంటి క్రెడిట్ భాగస్వామ్యాలను ఎంబెడెడ్ ఫైనాన్స్ అని పిలుస్తారు. కస్టమర్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు, ఒక సంస్థ రుణం ఇచ్చే సంస్థ‌ల‌తో టైఅప్ చేసుకుంటుంది. రుణ‌దాత‌లు కస్టమర్‌ను అంచనా వేసి, క్రెడిట్ లైన్‌ను అందిస్తాయ‌ని క్రెడిట్ బ్యూరోలో సీనియ‌ర్‌గా ప‌నిచేసిన పారిజత్ గార్గ్ తెలిపారు. 

ప‌రిశ్ర‌మ నిపుణ‌లు చెబుత‌న్న‌దాని ప్ర‌కారం ఇది వ్య‌క్తిగ‌త రుణం, క్రెడిట్ కార్డుల‌తో స‌మానంగా ప‌నిచేస్తుంది. వినియోగ వ‌స్తువుల‌(క‌న్జ్యూమ‌ర్ డ్యూర‌బుల్) స్టోర్‌కి వెళ్ళిన‌ప్పుడు, కొనుగోలు చేసిన వ‌స్తువుల‌కు రుణ‌దాత‌ల నుంచి ఫైనాన్స్ పొంద‌చ్చు. అదేవిధంగా ఆన్‌లైన్‌లో కూడా ఈ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి.  

గుర్తుంచుకోవల్సిన అంశాలు..
* పేలేట‌ర్‌, పోస్ట్‌పేయిడ్ స్కీమ్‌ల కోసం సైన‌ప్ చేసేప్పుడు ఇ-కామ‌ర్స్ సంస్థ‌, త‌న భాగ‌స్వామి పేరును ఆన్‌బోర్డింగ్ ప్ర‌క్రియలో తెలుపుతుంది. మీ క్రెడిట్ రిపోర్టులో రుణ‌దాత‌గా ఈ సంస్థ పేరు క‌నిపిస్తుంది. 
* ఇది రుణం కింద‌కి వ‌స్తుంది.. కాబ‌ట్టి దీన్ని మీరు తిరిగి చెల్లించ‌క‌పోయినా, చెల్లింపుల‌ను ఆల‌స్యం చేసినా మీ క్రెడిట్ నివేదిక‌లో ప్ర‌తిబింబించి, క్రెడిట్ స్కోరుపై ప్ర‌భావం చూపుతుంది. 
* చాలా సంస్థ‌లు నిర్దిష్ట కాలానికి ఉచితంగానే రుణం ఇస్తాయి. అయితే కొందరు సైన్ అప్ చేసినప్పుడు నిర్ధిష్ట ఫీజు లేదా వన్ టైమ్ ఫీజు వసూలు చేయవచ్చు. అందువ‌ల్ల‌ ఛార్జీలను ముందే తెలుసుకోవాలి. 
* ఇది వ్య‌క్తిగ‌త రుణం మాదిరిగానే ఉంటుంది. అవ‌స‌రం లేక‌పోతే సైన‌ప్ చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది. సంస్థ‌లు రుణ గ్ర‌హీత‌ల క్రెడిట్ స్కోరు ప‌రిశీలిస్తుంటాయి. అందువ‌ల్ల స్వ‌ల్ప కాలంలో ఎక్కువ సేవ‌ల‌ను వినియోగించుకోవ‌డం రుణ చ‌రిత్ర‌పై ప్ర‌భావం చూపుతుంది. చెల్లింపులు స‌కాలంలో చేయ‌డం.. మ‌ర్చిపోయే అవ‌కాశ‌మూ ఉంది. 
* మీరు ఇప్ప‌టికే క్రెడిట్ కార్డు వినియోగిస్తుంటే, ఈ సేవ‌ల నుంచి దూరంగా ఉండ‌టమే మంచిది. పే-లేట‌ర్ సేవ‌ల‌కి బ‌దులుగా 40 రోజులుగా పైగా క్రెడిట్ ఫ్రీ ప‌రియ‌డ్ అందించే కార్డులను ఉప‌యోగించ‌డం మేలు. 
* పే-లేట‌ర్ సేవ‌లు ఇంకా ప్రారంభ ద‌శ‌లోనే ఉన్నాయి. సంస్థ‌లు త‌మ వినియోగ‌దారులకు అనువైన వ్యాలెట్ విధానాన్ని అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. 
* ప్ర‌స్తుతం చాలా సంస్థ‌లు  రూ.5వేల నుంచి రూ.10వేల ప‌రిమితితో పే-లేట‌ర్ సేవ‌ల‌ను అందిస్తున్నాయి. రుణం తీసుకునే వ్య‌క్తి ప్ర‌వ‌ర్త‌న(స‌మ‌యానికి తిరిగి చెల్లించ‌డం వంటివి) ఆధారంగా ప‌రిమితిని పెంచడంతో పాటు రివార్డుల‌ను అందిస్తున్నారు. 
* ఒక మాట‌లో చెప్పాలంటే ఈ పే-లేట‌ర్ సేవ‌ల‌ను క్రెడిట్ కార్డుకు ప్ర‌త్యామ్నాయంగా అభివృద్ధి చెస్తున్నారు. 

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని