close

తాజా వార్తలు

Published : 29/09/2020 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పేటీఎంలో మళ్లీ యూపీఐ క్యాష్‌బ్యాక్స్‌

దిల్లీ: ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ పేటీఎం మళ్లీ క్యాష్‌బ్యాక్‌ స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది. ‘పేటీఎం క్రికెట్‌ లీగ్‌’ పేరిట యూపీఐ క్యాష్‌బ్యాక్‌, స్ర్కాచ్‌ కార్డ్స్‌ను తీసుకొచ్చింది. గూగుల్‌ ప్లేస్టోర్‌లో తాత్కాలిక నిషేధానికి గురైన కొద్ది రోజుల్లోనే పేటీఎం మళ్లీ ఈ క్యాష్‌బ్యాక్‌ స్కీమ్‌ను తీసుకురావడం గమనార్హం.

పేటీఎం యాప్‌లోని యూపీఐ పేమెంట్స్‌ను ఉపయోగించి మొబైల్‌ బిల్స్‌, రీఛార్జులు, ఇతర లావాదేవీలు జరిపినప్పుడు క్రికెట్‌ స్టార్ల స్టిక్కర్లు సేకరించొచ్చని, వాటిని ఒక సెట్‌గా రూపొందించి రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చని పేటీఎం ఓ ప్రకటనలో తెలిపింది. పేటీఎం క్రికెట్‌ లీగ్‌ను రివార్డు ప్రోగ్రామ్‌ను తీసుకురావడం ఆనందంగా ఉందని, ఈ ప్రమోషనల్‌ కార్యక్రమం మార్గదర్శకాలకు లోబడి ఉందని పేటీఎం ప్రతినిధి ఒకరు తెలిపారు. నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ జూదం, బెట్టింగ్‌లు నిర్వహించడం తన పాలసీకి విరుద్ధమని పేర్కొంటూ ఈ నెల 18న పేటీఎం యాప్‌ను గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. కొద్ది గంటల్లోనే పునరుద్ధరించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.