Paytm Payments Bank: చిన్న రుణాల బ్యాంక్‌గా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌! - Paytm payments banks will work as small finance banks
close

Published : 08/08/2021 17:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Paytm Payments Bank: చిన్న రుణాల బ్యాంక్‌గా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌!

వచ్చే ఏడాది దరఖాస్తు  చేసుకునే అవకాశం

దిల్లీ: కార్యకలాపాలు ప్రారంభించి వచ్చే ఏడాదికి ఐదేళ్లు పూర్తి అవుతున్నందున, చిన్న రుణాల బ్యాంక్‌ (స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌) లైసెన్సు కోసం పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ దరఖాస్తు చేసుకోనున్నట్లు సమాచారం. అయితే తుది నిర్ణయాన్ని కంపెనీ ఆ సమయంలోనే తీసుకుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చెల్లింపు బ్యాంకులుగా (పేమెంట్స్‌ బ్యాంక్స్‌) అయిదేళ్లు కార్యకలాపాలు పూర్తి చేసుకుంటే చిన్న రుణాల బ్యాంకు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్‌బీఐ నిబంధనలు చెబుతున్నాయి. చెల్లింపు బ్యాంకులు చెల్లింపుల కార్యకలాపాలతో పాటు పరిమిత డిపాజిట్, ఖాతా సేవలను నిర్వహించవచ్చు. ఇతర బ్యాంకులకు బిజినెస్‌ కరస్పాండెంట్‌లుగా కూడా వ్యవహరించవచ్చు. కానీ రుణాలను మాత్రం ఇచ్చే వీలుండదు. చిన్న రుణాల బ్యాంక్‌గా మారితే రుణాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే పేమెంట్స్‌ బ్యాంక్‌గా ఒక సంస్థ కార్యకలాపాలు నిర్వహించిన తీరు ఆధారంగా చిన్న రుణాల బ్యాంకు లైసెన్సు ఇవ్వాలా వద్దా అనే నిర్ణయాన్ని ఆర్‌బీఐ తీసుకుంటుంది. పేటీఎం 2017 మేలో ప్రారంభమైంది. 2022లో ఈ సంస్థకు పేమెంట్స్‌ బ్యాంక్‌గా ఐదేళ్లు పూర్తవుతాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని