Paytm IPO: తాజా ఈక్విటీ షేర్లతోనే రూ.12వేల కోట్లు! - Paytm to raise Rs 12000 cr via fresh equity
close

Published : 18/06/2021 17:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Paytm IPO: తాజా ఈక్విటీ షేర్లతోనే రూ.12వేల కోట్లు!

దిల్లీ: డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం రూ.12 వేల కోట్ల విలువ చేసే తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు ఇటీవల జరిగిన వాటాదారుల సమావేశంలో వెల్లడించింది. అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సంస్థ ఐపీఓ నవంబరులో వచ్చే అవకాశం ఉంది. తాజా ఈక్విటీ షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద కూడా షేర్లను విక్రయించనున్నట్లు పేటీఎం తెలిపింది. ప్రస్తుతం ప్రధాన వాటాదారుల్లో ఒకరైన విజయ్‌ శేఖర్‌ శర్మకు ఉన్న ప్రమోటర్‌ హోదాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సుమారు రూ.22,000 కోట్ల తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు కంపెనీ బోర్డు ఇటీవలే సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. దీంట్లో రూ.12 వేల కోట్లు తాజా ఈక్విటీ షేర్ల ద్వారానే సమీకరించనుండడం విశేషం. ఈ ఏడాది అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఈ ఐపీఓ వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

పేటీఎం పబ్లిక్‌ ఇష్యూ ఈ స్థాయిలో జరిగితే దేశంలోనే అత్యధిక మొత్తంలో నిధులు సమీకరిస్తున్న ఐపీఓగా ఇది చరిత్ర సృష్టించనుంది. పేటీఎంలో అలీబాబా యాంట్‌ గ్రూప్‌ (29.71 శాతం), సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ (19.63%), సైఫ్‌ పార్ట్‌నర్స్‌ (18.56%), విజయ్‌ శేఖర్‌ శర్మ (14.67%) వాటాదార్లుగా ఉన్నారు. తాజాగా విజయ్‌ శేఖర్‌ శర్మ ప్రమోటర్‌ హోదాను తొలగించడంతో ఆయన వాటాలు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఏజీహెచ్‌ హోల్డింగ్‌, టి రోవే ప్రైస్‌ అండ్‌ డిస్కవరీ క్యాపిటల్‌, బెర్క్‌షేర్‌ హాథ్‌వేలకు 10 శాతం కంటే తక్కువ వాటా ఉంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని