close

Published : 11/04/2021 13:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సమాజానికి మరింతగా వెనక్కి ఇచ్చేస్తున్నారు

యువతరం ధోరణి ఇది

భారత్‌లోని కటుంబాలు దాతృత్వ కార్యకలాపాల్లో మరింతగా లీనమవుతున్నాయి. స్వల్పకాలిక దానాలే కాదు.. లాభాపేక్ష రహిత సంస్థలకు దీర్ఘకాల నిధులు ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గడం లేదు. గతేడాది కరోనా నేపథ్యంలోనూ వీరు సమాజానికి మేలు చేశారు. ఈ ఏడాది కూడా ఈ ధోరణి కొనసాగుతుందని వ్యూహాత్మక వితరణ సంస్థ దస్రా విడుదల చేసిన ఒక నివేదిక చెబుతోంది. ఆయా కుటుంబాల ఆసక్తులు వేరే అయినా కూడా, యువతరం మాత్రం సమాజహితానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తెలిపింది. ఇటీవల గివ్‌ఇండియా నిర్వహించిన సర్వేలో దేశంలోని 85 శాతం మంది వితరణశీలురు తమ దాతృత్వ పరిమాణాన్ని పెంచనున్నట్లు తెలిపిన అంశాన్ని ఉదహరించింది. స్థానిక కమ్యూనిటీలకు మరింతగా వితరణ చేయాలని 74 శాతం మంది భావిస్తున్నారనీ గుర్తు చేసింది. ‘సాధారణ పరిస్థితులు నెలకొనే కొద్దీ, వ్యక్తిగత వితరణశీలుర ప్రాధాన్యాలు మారొచ్చేమో కానీ.. అందులో నాలుగో వంతు మాత్రం ఈ ఏడాది చురుగ్గానే ఉండొచ్చు. ఈ ఏడాది సామాజిక స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎస్‌ఎస్‌ఈ) వంటి కొత్త ప్లాట్‌ఫారమ్‌ల రాకతో దానశీలుర సంఖ్య మరింత పెరగవచ్చ’ని ఆ నివేదిక పేర్కొంది.

 సీఎస్‌ఆర్‌ తగ్గింది...

గతేడాదితో పోలిస్తే కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) మూలధనం చాలా తగ్గింది. ఫారెన్‌ కంట్రిబ్యూషన్‌(రెగ్యులేషన్‌) యాక్ట్‌ నిబంధనల కారణంగా అంతర్జాతీయ నిధులు తగ్గాయి. అయితే కుటుంబ వ్యాపారుల్లోని వితరణశీలురు మాత్రం సొంతంగా తమ దాతృత్వ కార్యకలాపాలను నిర్వహించాలని భావిస్తున్నారు.

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని