మండుతున్న పెట్రోల్‌ ధరలు - Petrol Diesel prices at new highs
close

Published : 11/02/2021 09:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మండుతున్న పెట్రోల్‌ ధరలు

దిల్లీ: దేశంలో చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. వరుసగా మూడో రోజులు ఇంధన ధరలు పెరిగి కొత్త గరిష్ఠాలను తాకాయి. గురువారం పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర 87.85కు చేరింది. డీజిల్‌ ధర రూ. 78.03గా ఉంది.

హైదరాబాద్‌లోనూ ఇంధన ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే నగరంలో రూ. 91 దాటిన లీటర్‌ పెట్రోల్‌ ధర గురువారం రూ. 91.35కు చేరింది. లీటర్‌ డీజిల్‌ ధర రూ. 85.11గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చమురు ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.36 పలుకుతుండగా.. డీజిల్‌ ధర రూ. 84.94గా ఉంది. 

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల ఆధారంగా రోజువారీగా ధరల్లో హెచ్చుతగ్గులను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ అమలు చేస్తోంది. గత కొంతకాలంగా  ప్రతి వారంలో మూడు నుంచి నాలుగు రోజులపాటు ధరలను పెంచుతోంది. మిగిలిన రెండు, మూడు రోజులు ధరల పెరుగుదలలో మార్పు ఉండటం లేదు. వరుస పెంపులతో వాహనదారుల జేబులు గుల్ల అవుతున్నాయి. 

ఇదీ చదవండి..

‘పెట్రో’పై పన్నులు తగ్గించబోం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని