close

తాజా వార్తలు

Updated : 26/10/2020 18:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు?

ఎక్సైజ్‌ సుంకం పెంపునకు ప్రభుత్వ యోచన

దిల్లీ: కొవిడ్‌-19 తెచ్చిపెట్టిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం అదనపు ఆదాయ మార్గాలను వెతుకుతోంది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచాలని ఆలోచిస్తోంది. కాగా ఈ పెరుగుదల లీటరుకు రూ.3 నుంచి 6 వరకు ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు.

ఆర్థిక వ్యవస్థ కోలుకొనేందుకు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీల నిర్వహణకు అదనపు వనరులు అవసరమౌతున్న నేపథ్యంలో.. వీటిని సమకూర్చుకునేందుకు ఇంధన ధరలను పెంచక తప్పదని ప్రభుత్వం భావిస్తోంది. గత నెలరోజులుగా ఇంధనాలపై ఎక్సైజ్‌ సుంకం పెంచని నేపథ్యంలో ఇదే తగిన సమయమని నిపుణులు అంటున్నారు. ఈ చర్య వల్ల సంవత్సరానికి రూ. 60,000 కోట్ల అదనపు ఆదాయం లభించగలదని అంచనా. కాగా, ఎక్సైజ్‌ సుంకం పెరుగుదలను గురించిన విధివిధానాలపై కేంద్రం కసరత్తులు ఇప్పటికే మొదలైనట్టు తెలిసింది. ఈ పెంపు నిర్ణయం ఎప్పుటి నుంచి అమలులోకి వచ్చేదీ త్వరలోనే ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

పెట్రో ఇంధనాలపై అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉంది. ప్రస్తుత ధరలో సుమారు 70 శాతం పన్నులే అనే సంగతి తెలిసిందే. కాగా, ప్రతిపాదిత ఎక్సైజ్‌ సుంకం పెరుగుదలతో ఇది 75 నుంచి 80 శాతానికి కూడా చేరే అవకాశముందని పరిశీలకుల అంచనా. అయితే ఈ భారం రిటైల్‌ అమ్మకాలపై పడితే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురు కాగలదని పరిశీలకులు అంటున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.