Petrol: గుంటూరులో లీటర్‌ ₹100 దాటేసింది  - Petrol diesel prices hiked
close

Updated : 29/05/2021 09:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Petrol: గుంటూరులో లీటర్‌ ₹100 దాటేసింది 

దిల్లీ: దేశంలో పెట్రో ధరలు మండిపోతున్నాయి. వరుసగా 15వ రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోల్‌, డీజిల్‌పై 19 పైసల నుంచి 30 పైసలు వరకు పెంచారు. దీంతో మొత్తం 15 రోజుల వ్యవధిలో లీటరు పెట్రోల్‌పై రూ.3.54, డీజిల్‌పై రూ.4.16 చొప్పున పెరిగింది. తాజా పెంపుతో గుంటూరులో లీటరు పెట్రోల్‌ ధర రూ.100లు దాటేసింది. ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ రూ.100.12లు.. డీజిల్‌ ధర రూ.94.44లుగా ఉంది. గుంటూరులో ప్రీమియం పెట్రోల్‌ ధర రూ.103.58లుగా ఉంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర 99.92, డీజిల్‌ ధర రూ.94.24లుగా ఉండగా.. విజయవాడలో లీటరు ప్రీమియం పెట్రోల్‌ ధర రూ.103.38గా ఉంది.

15వ రోజూ పెంచిన ధరలతో దేశంలోని కొన్ని చోట్ల లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100లు దాటేసింది. దిల్లీలో లీటరు పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెరగడంతో.. పెట్రోల్‌ ధర రూ.93.94లు, డీజిల్‌ ధర రూ.84.89లుగా ఉంది. ముంబయిలో లీటరు పెట్రోల్‌ ధర రూ.100.19లుగా ఉండగా.. డీజిల్ ధర రూ.92.17గా ఉంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని