Petrol price: సెంచరీ దాటినా ఆగని పరుగు!  - Petrol price hiked again
close

Updated : 06/06/2021 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Petrol price: సెంచరీ దాటినా ఆగని పరుగు! 

దిల్లీ: ఇప్పటికే కరోనాతో అల్లాడుతున్న ప్రజలను.. చమురు ధరల పెరుగుదల మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఆదివారం పెట్రోలుపై 28 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెంచారు. ధరల పెంపు ఆరు రోజుల్లో ఇది మూడోసారి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.98.76, డీజిల్‌ ధర రూ.93.70కి చేరింది. మరోవైపు ఇంధనం నిల్వ కేంద్రం నుంచి రవాణా దూరం ఆధారంగా ఇప్పటికే రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, జోగులాంబ, కుమురం భీం, నిర్మల్‌ జిల్లాల్లో లీటరు పెట్రోలు ధర రూ.వంద దాటిన విషయం తెలిసిందే. మరోవైపు ఏపీలో అనంతపూర్‌, చిత్తూరు, తూర్పు గోదావరి, విజయవాడ, గుంటూరులోనూ లీటర్‌ పెట్రోల్‌ ధర వందకు చేరింది.

వాణిజ్య రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.101.25, డీజిల్ ధర లీటరుకు రూ. 93.10 పెరిగినట్లు ప్రభుత్వ ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ఇక దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.95.03, డీజిల్‌ రేటు రూ.85.95గా ఉన్నాయి. చైన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.96.47, కోల్‌కతాలో రూ.95.02, బెంగళూరులో రూ.98.20, లఖ్‌నవూలో రూ.92.29, పట్నాలో రూ.రూ.97.18, చండీగఢ్‌లో రూ.91.40కు చేరింది. మరో వైపు డీజిల్ లీటర్‌ ధర చైన్నైలో రూ.90.66, కోల్‌కతాలో రూ.88.80, బెంగళూరులో రూ.91.12, పట్నాలో రూ.91.24, లఖ్‌నవూలో రూ.86.35కి చేరింది. అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లాలో లీట‌ర్‌ పెట్రోల్‌ ధర రూ.105.33కి చేరగా.. డీజిల్‌ ధర వందకు చేరువైంది.



మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని