భారత్‌లో వెనక్కి తగ్గిన ఫైజర్! - Pfizer withdraws Emergency Use Authorisation application in India
close

Updated : 05/02/2021 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో వెనక్కి తగ్గిన ఫైజర్!

దిల్లీ: తాము తయారుచేసిన కరోనా టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని కోరుతూ భారత్‌లో చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్‌ వెల్లడించింది. భారత్‌లో కరోనా టీకా వినియోగానికి దరఖాస్తు చేసుకున్న తొలి సంస్థ ఫైజరే కావడం గమనార్హం. యూకే, బహ్రైన్‌లో అనుమతి రాగానే ఫైజర్‌ భారత్‌పై ఆసక్తి చూపింది.

ఫైజర్‌ దరఖాస్తుపై భారత్‌లోని నిపుణుల కమిటీ ఫిబ్రవరి 3న సమీక్ష నిర్వహించింది. టీకా భద్రతపై ఇంకా అదనపు సమాచారం కావాలని కంపెనీ ప్రతినిధులకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే దరఖాస్తును వెనక్కి తీసుకుంటున్నట్లు ఫైజర్‌ వెల్లడించింది. కమిటీ కోరిన సమాచారం అందుబాటులోకి రాగానే మరోసారి దరఖాస్తు చేసుకుంటామని తెలిపింది. భారత ప్రజలకు కొవిడ్‌ టీకాను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది.

భారత్‌లో వినియోగానికి ఫైజర్‌ గత డిసెంబరులో దరఖాస్తు చేసుకుంది. కొవిడ్‌ నిరోధం కోసం తయారు చేసిన వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకునేందుకు అనుమతించాలని కోరింది. అలాగే భారత్‌లో క్లినికల్‌ పరీక్షలు తప్పనిసరిగా జరపాలన్న నిబంధనన నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దీనికి అంగీకరించని నిపుణుల కమిటీ మరింత సమాచారంతో రావాలని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి...

క్రియాశీల రేటు..1.40 శాతం

ఇది బైడెన్‌ ప్రభుత్వం..ఇక్కడ అన్నీ రిపేర్‌ చేస్తాం!


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని