PhonePe Insurance: ఇకపై డైరెక్ట్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ సేవల్లోకి ఫోన్‌పే - PhonePe gets IRDAI license to serve as direct insurance broker
close

Published : 30/08/2021 20:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PhonePe Insurance: ఇకపై డైరెక్ట్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ సేవల్లోకి ఫోన్‌పే

దిల్లీ: ఐఆర్‌డీఏఐ నుంచి తమకు పూర్తిస్థాయి ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ లైసెన్స్‌ లభించినట్లు ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ వేదిక ఫోన్‌పే వెల్లడించింది. ఇప్పటి వరకు పరిమితులతో కూడిన ఇన్సూరెన్స్‌ ‘కార్పొరేట్‌ ఏజెంట్‌’గా ఫోన్‌పే కొనసాగుతోంది. దీనివల్ల ఒక్కో కేటగిరీలో కేవలం మూడు బీమా ఉత్పత్తులను మాత్రమే వినియోగదారులకు చేరువ చేయగలుగుతోంది. తాజాగా లభించిన లైసెన్స్‌తో అన్ని బీమా కంపెనీలకు చెందిన అన్ని ఉత్పత్తులను యూజర్లకు చేర్చొచ్చు. అలాగే తన వినియోగదారులకు ఫోన్‌పే ప్రత్యేకంగా కొన్ని బీమా ఉత్పత్తులను కూడా సిఫార్సు చేయొచ్చు. జనవరి, 2020లో ఇన్సూరెన్స్‌ విభాగంలోకి అడుగుపెట్టిన ఫోన్‌పే జనరల్‌, టర్మ్‌, ఆరోగ్య బీమా ఉత్పత్తులను తన వినియోగదారులకు చేరువ చేస్తోంది. ఫోన్‌పే ద్వారా సాధారణ ఆర్థిక లావాదేవీలతో పాటు మొబైల్‌, డీటీహెచ్‌ రిఛార్జ్‌, పలు రకాల సేవలకు చెల్లింపులు చేయొచ్చు. మొత్తం 300 మిలియన్ల మంది యూజర్లు ఫోన్‌పేలో రిజిస్టర్‌ చేసుకున్నారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని