ఆగ‌స్టు 4న ప్రారంభం కానున్న `పిజ్జా హ‌ట్` దేవ్‌యాని ఐపీఓ - Pizza-Hut-KFC-operator-Devyani-International-IPO-to-open-on-August-4
close

Published : 30/07/2021 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆగ‌స్టు 4న ప్రారంభం కానున్న `పిజ్జా హ‌ట్` దేవ్‌యాని ఐపీఓ

పిజ్జా హ‌ట్‌, కేఎఫ్‌సీ ఆప‌రేట‌ర్ దేవ్‌యాని ఇంట‌ర్నేష‌న‌ల్ ఐపీఓ ఆగ‌స్టు 4న ప్రారంభ‌మ‌వుతుంది. ఐపీఓలో ఒక్కో షేరుకి ధ‌ర‌ను రూ. 86-90గా నిర్ణ‌యించింది.

దేశంలో స్విగ్గీలోను, జోమాటో ప్లాట్‌ఫామ్స్‌లో లిస్ట్ చేయ‌బ‌డిన అతిపెద్ద క్విక్‌-స‌ర్వీస్ రెస్టారెంట్ సంస్థ దేవ్‌యాని. కేఎఫ్‌సీ అతిపెద్ద ఫ్రాంచైజ్‌, పిజ్జా హ‌ట్‌, కోస్టా కాఫీ ద్వారా రూ. 1,838 కోట్ల ఐపీఓ ఆగ‌స్టు 4న స‌బ్స్‌క్రిప్ష‌న్ కోసం తెర‌వ‌బ‌డుతుంది. ఆగ‌స్టు 6న ముగుస్తుంది. రూ. 440 కోట్ల షేర్‌ల తాజా ఇష్యూ, 15.53 కోట్ల షేర్ల వ‌ర‌కు ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ క‌లిగి ఉంది.

2021 ఆర్థిక సంవ‌త్స‌రంలో కోర్ బ్రాండ్ల (దేశీయంగా, అంత‌ర్జాతీయంగా) నుండి దేవ్‌యాని వ్యాపార కార్య‌క‌లాపాల ద్వారా వ‌చ్చే ఆదాయంలో 94.19% వాటాను క‌లిగి ఉంది. డెలివ‌రీ విక్ర‌యాలు 2020 ఆర్ధిక సంవ‌త్స‌రంలో 51.15 శాతంతో పోలిస్తే 2021లో 70.20% ఆదాయం పెరిగింది. గ‌త 6 నెల‌ల్లో కంపెనీ త‌న ప్ర‌ధాన బ్రాండ్ వ్యాపారంలో 109 స్టోర్ల‌ను ప్రారంభించింది. కేఎఫ్‌సీ, పిజ్టా హ‌ట్  2020 మే, జూన్ నెల‌ల్లో కాంటాక్ట్‌లెస్ డెలివ‌రీని ప్రారంభించిన తొలి కంపెనీల‌లో ఒక‌టి అని కంపెనీ తెలిపింది.

వాంగో, ఫుడ్ స్ట్రీట్‌, మ‌సాలా ట్విస్ట్‌, ఐల్ బార్‌, అమ్రేలి, క్రుష్ జ్యూస్ బార్ వంటి బ్రాండ్‌ల‌ను కూడా కంపెనీ క‌లిగి ఉంది. భార‌త్‌లో 26 రాష్ట్రాల్లో, 155 న‌గ‌రాల్లో 692 స్టోర్లు ఉన్నాయి. అలాగే అంత‌ర్జాతీయంగా నేపాల్‌, నైజీరియాలో కూడా స్టోర్స్ ఉన్నాయి. కంపెనీ 1997లో జైపూర్‌లోని త‌న మొద‌టి పిజ్జా హ‌ట్ స్టోర్‌తో `యమ్‌`తో  త‌న వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇది ప్ర‌స్తుతం మార్చి 31 నాటికి 297 పిజ్జా హ‌ట్ స్టోర్లు, 264 కేఎఫ్‌సీ స్టోర్లు, 44 కోస్టా కాఫీల‌ను నిర్వ‌హిస్తోంది.

మార్చి 2019-2021 మ‌ధ్య‌కాలంలో కోర్ బ్రాండ్ స్టోర్స్ 469 స్టోర్స్ నుండి 605 స్టోర్స్ వ‌ర‌కు 13.58% `సీఏజీఆర్‌` వృద్ధిని సాధించింది. కంపెనీ 9,356 ఉద్యోగుల‌ను క‌లిగి ఉంది. 2020-2025 నాట‌కి `క్విక్ స‌ర్వీస్ రెస్టారెంట్` ప‌రిశ్ర‌మ అమ్మ‌క‌పు విలువ 12.4% `సీఏజీఆర్‌` వ‌ద్ద పెరుగుతుంద‌ని భావిస్తున్నారు.

కోట‌క్ మ‌హీంద్రా క్యాపిట‌ల్ కంపెనీ, సీఎల్ఎస్ఏ ఇండియా, ఎడెల్విస్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్‌వెస్ట్‌మెంట్ అడ్వైజ‌ర్స్ ఈ ఐపీఓ ఇష్యూకు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక‌ర్లుగా నియ‌మించ‌బ‌డ్డారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని