అధిక బీమా గ‌ల ట‌ర్మ్ ప్లాన్‌కి ప్రీమియం ఎంత ? - Planning-to-buy-Rs-one-crore-term-insurance-plan
close

Published : 16/10/2021 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అధిక బీమా గ‌ల ట‌ర్మ్ ప్లాన్‌కి ప్రీమియం ఎంత ?

త‌క్కువ ప్రీమియంతో లైఫ్ క‌వ‌రేజ్ ఎక్కువ ఉండాలంటే ట‌ర్మ్ ఇన్సూరెన్స్ మంచి ఎంపిక. ఈ ట‌ర్మ్ ఇన్సూరెన్స్‌లో ప్రీమియం త‌క్కువ ఉంటుంది. అధిక మొత్తానికి సాంప్ర‌దాయ‌క బీమా పాల‌సీల‌ను తీసుకోవాలంటే ఎక్కువ బీమా ప్రీమియంని క‌ట్ట‌వ‌ల‌సి ఉంటుంది. ఇది అంద‌రికి సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. దీనికి సుల‌భ‌మైన మార్గం ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాల‌సీ తీసుకోవ‌డ‌మే.  మీ కుటుంబానికి ఆర్ధిక భ‌ద్ర‌త క‌ల్పించాలంటే సుల‌భ‌మైన స‌ర‌స‌మైన మార్గాల‌లో ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ఒక‌టి. అయితే ఈ ఇన్సూరెన్స్‌లో క‌ట్టిన ప్రీమియం మెచ్యూరిటి టైమ్‌లో తిరిగి రాదు. కానీ ఆర్ధిక భ‌ద్ర‌త చాలా ఎక్కువ‌. ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాల‌సీని కొనుగోలు చేసేట‌ప్పుడు, క‌వ‌రేజ్ మొత్తానికి లెక్క‌లు వేసుకోవ‌డం చాలా ముఖ్యం. ప్ర‌స్తుతానికి ఇంకా కొన‌సాగుతున్న కోవిడ్‌-19 స‌మ‌యంలో ప్ర‌పంచం యావ‌త్తు కొత్త ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నందున ట‌ర్మ్ ప్లాన్ తీసుకోవ‌డం చాలా అవ‌స‌ర‌మ‌వుతుంది. పాల‌సీ వ్య‌వ‌ధిలో పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి అకాల మ‌ర‌ణం సంభ‌విస్తే వారి కుటుంబానికి ఇన్సూరెన్స్ హామీ మొత్తాన్ని చెల్లించ‌డం జ‌రుగుతుంది. ఇది వారికి ఆదాయ భ‌ర్తీ సాధ‌నంగా ప‌నికొస్తుంది. ఇంటిలో ఆధార‌ప‌డే కుటుంబ‌స‌భ్యులు ఉన్న‌ప్పుడు ఎవ‌రికైనా బీమా చాలా అవ‌స‌రం. త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ క‌వ‌రేజ్ ఉండే ట‌ర్మ్ ఇన్సూరెన్స్ చాలా అవ‌స‌రం.

ఒక వ్య‌క్తి చిన్న వ‌య‌సులోనే ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాల‌సీని పొందితే ప్రీమియం సాధార‌ణంగా త‌క్కువ ఉంటుంది. అయితే ధూమ‌పానం (పొగ‌), మ‌ద్యం త్రాగే వ్య‌క్తుల‌కైతే బీమా ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాల‌సీని తీసుకునేటపుడు, క‌వ‌రేజ్ మొత్తాన్ని అంచ‌నా వేసేట‌పుడు, మీ ఆదాయం, మీ ఆర్ధిక ల‌క్ష్యాలు, భ‌విష్య‌త్తులో ద్ర‌వ్యోల్బ‌ణ రేటు ఇవ‌న్ని దృష్టిలో పెట్టుకుని.. పాల‌సీ ఎంత తీసుకుంటే బాగుంటుందో అంచ‌నా వేసుకోవాలి. మీ ప్ర‌స్తుత వార్షిక ఆదాయంలో 15-20 రెట్ల‌కు స‌మాన‌మ‌య్యే బీమా పాల‌సీని తీసుకుంటే మంచిద‌ని నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు. మీరు ట‌ర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తున్న‌పుడు.. పాల‌సీ ప్ర‌యోజ‌నాలు, ఫీచ‌ర్లు, ప్రీమియం మొత్తం, బీమాదారు క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్ప‌త్తి ఆధారంగా వివిధ బీమా కంపెనీల, పాల‌సీ ఆఫ‌ర్‌ల‌ను స‌రిపోల్చుకుని పాల‌సీ ఎంపిక చేసుకోవాలి.

ఇక్క‌డ ధూమ‌పానం చేయ‌ని 30 సంవ‌త్స‌రాల వ్య‌క్తి వ‌య‌స్సు ఆధారంగా ప్రీమియంలు ఇవ్వ‌బ‌డ్డాయి. మీకు వ‌ర్తించే ప్రీమియం మీ వ‌య‌స్సు, ఆదాయం, జెండ‌ర్‌, పాల‌సీ ఫీచ‌ర్లు, మీరు ఎంచుకున్న బీమా సంస్థ నిర్ధేశించిన ఇత‌ర ష‌ర‌తులపై ఆధార‌ప‌డి ఉంటాయి. 30 సంవత్స‌రాల కాల వ్య‌వ‌ధికి కొర‌కు రూ. కోటి ట‌ర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల‌నుకునే వారికి 13 ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాల‌సీల జాబితాను..  సూచించే వార్షిక `ఈఎమ్ఐ`ల‌ను  దిగువ టేబుల్‌లో అందిస్తున్నాం. `ఐఆర్‌డీఏ` వార్షిక నివేదిక ప్ర‌కారం ముఖ్యంగా డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోలు టేబుల్‌లో ఇవ్వ‌బ‌డ్డాయి.

ట‌ర్మ్ పాల‌సీ ప్రీమియంల‌ను ప‌రిశీలించ‌డానికి `పాల‌సీ బ‌జార్‌`, `క‌వ‌ర్ పాక్స్‌` వెబ్‌సైట్స్‌ను ఆన్‌లైన్‌లో సంద‌ర్శించ‌వ‌చ్చు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని