Business: పాల‌సీ బ‌జార్ `ఐపీఓ`కు కంపెనీ బోర్డు ఆమోదం - Policybazaar-board-approves-Rs-6500-crore-IPO
close

Updated : 22/07/2021 17:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Business: పాల‌సీ బ‌జార్ `ఐపీఓ`కు కంపెనీ బోర్డు ఆమోదం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ అగ్రిగేట‌ర్ `పాల‌సీ బ‌జార్` ఇనిషియల్‌ ప‌బ్లిక్ ఆఫ‌రింగ్ (ఐపీఓ) ద్వారా రూ. 6,500 కోట్లు సేక‌రించ‌డానికి దాని బోర్డు నుంచి అనుమ‌తి పొందింది. ఐపీఓ ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ దాని పెట్టుబ‌డిదారుల ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్‌, రెగ్యులేట‌రీ ఫైలింగ్స్ చూపిస్తుంది. పెయిడ్‌-అప్ ఈక్విటీ షేర్ క్యాపిట‌ల్‌లో నాన్ రెసిడెంట్ ఇండియ‌న్ (ఎన్ఆర్ఐ) పెట్టుబ‌డి ప‌రిమితిని 10% నుంచి 24%కు కంపెనీ పెంచింది. ప్ర‌త్యేక ఫైలింగ్‌లో కంపెనీ త‌న రుణ శ‌క్తిని రూ. 1000 కోట్ల‌కు విస్త‌రించింది.

గ‌త‌వారం ఫుడ్ డెలివ‌రీ ప్లాట్‌ఫామ్ జొమాటో సంస్థాగ‌త, రిటైల్ పెట్టుబ‌డిదారుల ఆసక్తిని ప్రభావవంతంగా ఆక‌ర్షించి, భార‌తీయ వ్యాపార సంస్థ‌ల షేర్ల ప‌బ్లిక్ ఇష్యూను విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. చెల్లింపుల రంగానికి చెందిన పేటీఎమ్‌, మొబిక్విక్ అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ రంగానికి చెందిన‌వి. గ‌తవారం త‌మ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్ట‌స్‌ను వ‌రుస‌గా 2.2 బిలియ‌న్ డాల‌ర్ల‌కు, 255 మిలియ‌న్ డాల‌ర్ల ఫ్లోట్‌ల‌కు దాఖ‌లు చేశాయి.

ఈ ఏడాది ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని చూస్తున్న స్వ‌దేశీ వినియోగ‌దారుల ఇంట‌ర్నెట్ కంపెనీల‌లో `పాల‌సీ బ‌జార్` ఒక‌టి. వాల్‌మార్ట్ యాజ‌మాన్యంలోని ఫ్లిప్‌కార్ట్‌, లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్ `దిల్లీ`, ఫ్యాష‌న్ అండ్ బ్యూటీ ప్లాట్‌ఫాం `నైకా` ఈ సంవ‌త్స‌రం `ఐపీఓ`కు వెళ్ల‌డం కోసం వ‌రుస‌లో ఉన్నాయి.

`పాల‌సీ బ‌జార్‌` త‌న `యుఏఈ` వ్యాపారాన్ని వేగ‌వంతం చేయ‌డానికి న్యూయార్క్‌కు చెందిన `హెడ్జ్ ఫండ్ ఫాల్క‌న్ ఎడ్జ్ క్యాపిట‌ల్‌` నేతృత్వంలో మార్చిలో 75 మిలియ‌న్ డాల‌ర్ల‌ను సేక‌రించింది. దీనికి కొన్ని వారాల ముందే, `బే క్యాపిట‌ల్‌` ద్వితీయ ఒప్పందం ద్వారా గురుగ్రామ్‌కు చెందిన ఓ సంస్థ‌లో పెట్టుబ‌డిగా కొంత మొత్తాన్ని పెట్టింది. అయితే అక్టోబ‌ర్ 2020లో, ఫాల్క‌న్ ఎడ్జ్ క్యాపిట‌ల్ ద్వితీయ లావాదేవీ ద్వారా పాల‌సీ బ‌జార్‌లో కొంత వాటాను సొంతం చేసుకుంది. పాల‌సీ బ‌జార్ ఐపీఓ నిర్ణ‌యం కంటే ముందే పెట్టుబ‌డిదారుల నుంచి చాలా ఆస‌క్తిని చూరగొంది. సంస్థ‌లోని ఇత‌ర ముఖ్య పెట్టుబ‌డిదారుల‌లో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌, టెమాసెక్‌, ఇన్ఫో ఎడ్జ్, రిబిట్ క్యాపిట‌ల్ ఉన్నాయి. పాల‌సీ బ‌జార్ గ‌తేడాది సాఫ్ట్ బ్యాంక్ నుంచి సిరీస్ ఎఫ్ రౌండ్‌లో రెండోసారి 47.4 మిలియ‌న్ డాల‌ర్లు సేక‌రించింది.

2008లో యాషిష్ ద‌హియా, అలోక్ బ‌న్సాల్ స్థాపించిన `పాల‌సీ బ‌జార్‌` ఫిన్‌టెక్ గ‌తంలో ‘ఎటెచెస్ మార్కెటింగ్ అండ్ క‌న్స‌ల్టింగ్’ అనే పేరుతో ఉండేది. మొత్తం 7 వ్యాపారాల‌ను నిర్వ‌హిస్తోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని