రెన్యువల్‌ ప్రీమియంపై 80-100 శాతం ప్రోత్సాహకాలు  - Private health insurers offering 80 to100 pc discounts on renewal premia
close

Updated : 01/03/2021 09:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెన్యువల్‌ ప్రీమియంపై 80-100 శాతం ప్రోత్సాహకాలు 

ఆరోగ్యవంత జీవనశైలి గడిపే వారికే

ముంబయి: ఆరోగ్యవంత జీవనశైలి గడిపే వినియోగదారులకు పాలసీల పునరుద్ధరణ (రెన్యువల్‌) ప్రీమియంపై 80-100 శాతం ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రైవేటు ఆరోగ్య బీమా సంస్థలు  సిద్ధమవుతున్నాయి. బహుమతులు, ఇతర ప్రయోజనాలను అందిస్తున్నాయి. సాధారణంగా ఆరోగ్య బీమా సంస్థలు క్లెయిమ్‌ చేయని సంవత్సరాలకు నో-క్లెయిమ్‌ బోనస్‌ కింద 25-50 శాతం మధ్య ఇస్తుంటాయి. అయితే ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఇటీవల వినూత్న ఆరోగ్య బీమా పథకాన్ని ఆవిష్కరించింది. ఏడాది కాలంలో తగినన్ని రోజుల పాటు రోజూ 10,000 అడుగుల చొప్పున నడిచినా, లేదా తాము సూచించిన వ్యాయామం రోజూ 30 నిముషాల పాటు చేసినా, 6 నెలలకోసారి ఫిట్‌నెస్‌ పరీక్ష చేయించుకున్నా, మరుసటి ఏడాది పాలసీ పునరుద్ధరణ ప్రీమియంపై 100 శాతం వరకు హెల్త్‌ రిటర్న్‌లు ఇచ్చేందుకు సిద్ధమైంది. మందుల కొనుగోళ్లు, రోగ నిర్థారణ పరీక్షలు, ఓపీ ఖర్చులు, ప్రత్యామ్నాయ చికిత్సలకు లేదా భవిష్యత్తు ప్రీమియం చెల్లింపునకు వీటిని వినియోగించుకోవచ్చు.పాలసీదారు జీవనశైలిని యాక్టివ్‌ హెల్త్‌ యాప్‌ ద్వారా పరిశీలిస్తుంటుంది. ఈ పాలసీ కొనుగోలు చేసిన వ్యక్తి ఏడాదికి చెల్లించిన ప్రీమియం మొత్తంలో 50 శాతం చొప్పున నో-క్లెయిమ్‌ బోనస్‌ కింద వెనక్కి వస్తుంది. రెండేళ్లపాటు క్లెయిమ్‌ లేకపోతే బీమా పాలసీ ప్రీమియం మొత్తాన్ని వెనక్కి తిరిగి ఇచ్చే సరికొత్త పాలసీ ఇది. మరో సంస్థ ఫ్యూచర్‌ జనరాలీ ఇండియా కూడా 80 శాతం రాయితీతో సరికొత్త పాలసీ ప్రారంభించింది.

ఇవీ చదవండి..

బీమాతోనే మాకు ధీమా

ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని