అన్ని సమస్యలకు ప్రైవేటీకరణ పరిష్కారం కాదు - Privatisation is not the only solution for every problem says RBI ex deputy guv
close

Published : 13/02/2021 13:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్ని సమస్యలకు ప్రైవేటీకరణ పరిష్కారం కాదు

ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌ఎస్‌ ముంద్రా

కోల్‌కతా: అన్ని సమస్యలకు ప్రైవేటీకరణ ఒక్కటే పరిష్కారమనేది అపోహ మాత్రమేనని ఎప్పుడో తేలిందని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌ఎస్‌ ముంద్రా పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలోనే సంస్థలను కొనసాగిస్తూ, నిర్వహణ స్వేచ్ఛ, యాజమాన్య హక్కులను వేరుచేస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. బెంగాల్‌ ఛాంబర్‌ నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. సంస్థల పనితీరును యాజమాన్య హక్కుల మార్పిడి మారుస్తుందన్న ఆలోచన సహేతుకం కాదని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ నష్టపోతున్న సంస్థలున్నాయని గుర్తు చేశారు. ‘భారత్‌లో బ్యాంకింగ్‌ వాతావారణం గురించి చాలా మంది చాలా చెప్పారు. కొన్ని దశాబ్దాల్లో ప్రపంచ దేశాల్లో, భారత్‌లో బ్యాంకులకు ఎదురుదెబ్బలు కొనసాగుతున్నాయి. ఆర్థిక సంస్థకు ప్రభుత్వాల హామీ లభించడమే అన్నింటికీ కారణం’ అని ముంద్రా తెలిపారు. వృద్ధికి అవకాశం ఉన్నా కూడా మూలధనం కొరత ఎదురవుతోందని, వేర్వేరు రంగాల నుంచి డిమాండ్లు రావడం ఇందుకు కారణమని వివరించారు.

ఇవీ చదవండి...

పారిశ్రామికోత్పత్తి కళకళ

టాటా మోటార్స్‌కు కొత్త సారథి


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని